Rules Ranjan OTT: ఇవాళే ఓటీటీలోకి రూల్స్ రంజన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Rules Ranjan OTT: హీరో కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజన్ దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీ ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను రివీల్ చేసింది ప్రముఖ ఓటీటీ సంస్థ. స్టీమింగ్ ఎక్కడంటే?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2023, 12:12 PM IST
Rules Ranjan OTT: ఇవాళే ఓటీటీలోకి రూల్స్ రంజన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Rules Ranjan OTT Release Date: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. అక్టోబర్ 6న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని ఇవాళ అంటే నవంబరు 30 సాయంత్రం 06 గంటల నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది ఆహా ఓటీటీ. 

"రూల్స్ బుక్ ను తిరగ రాయడానికి రూల్స్ రంజన్ వచ్చేస్తున్నాడు. రూల్స్ రంజన్ ప్రీమియర్ నవంబర్ 30 సాయంత్రం 6 గంటలకు" అంటూ ఆహా ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. రూల్స్ రంజ‌న్ సినిమాలో నేహా శెట్టి, మెహ‌ర్ చాహ‌ల్ హీరోయిన్లుగా న‌టించారు. హైప‌ర్ ఆది, సుబ్బ‌రాజు, హ‌ర్ష చెముడు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రముఖ ప్రొడ్యూస‌ర్ ఏఎమ్ ర‌త్నం త‌న‌యుడు జ్యోతి కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమా ల‌వ్ స్టోరీలో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం, కామెడీ వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీని కారణంగా ఓటీటీ రిలీజ్ ఆలస్యమైనట్లు సమాచారం. 

రూల్స్ రంజన్ సినిమా దాదాపు నాలుగు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ కేవలం కోటిన్నర వరకే వసూళ్లు పరిమితం అవడంతో నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది. మీట‌ర్‌, రూల్స్ రంజ‌న్‌ల‌తో బ్యాక్ టూ బ్యాక్ ఫెయిల్యూర్స్ మూటగట్టుకున్న కిరణ్ తర్వాత సినిమాతోనైనా హిట్ కొట్టాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. 

Also read: BB 7 Telugu: ఓటింగ్‌లో దూసుకుపోతున్న రైతు బిడ్డ.. డేంజర్ జోన్ లో బెస్ట్ ఫ్రెండ్స్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News