Jithendar Reddy First Look: 'జితేంద‌ర్‌రెడ్డి' టైటిల్ రోల్ లో బాహుబ‌లి న‌టుడు.. ఫస్ట్ లుక్ రిలీజ్..

Jithendar Reddy Movie: తెలంగాణ పొలిటిక‌ల్ లీడ‌ర్ బ‌యోపిక్‌గా రాబోతున్న జితేంద‌ర్‌రెడ్డి మూవీ ఫ‌స్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీకి విరించివర్మ దర్శకత్వం వహిస్తున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 2, 2023, 12:39 PM IST
Jithendar Reddy First Look: 'జితేంద‌ర్‌రెడ్డి' టైటిల్ రోల్ లో బాహుబ‌లి న‌టుడు.. ఫస్ట్ లుక్ రిలీజ్..

Jithendar Reddy First Look: 'జితేంద‌ర్‌రెడ్డి' సినిమాలో(Jithender Reddy) హీరో ఎవరనేది క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. తాజాగా అతనికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. బీజేపీ లీడ‌ర్ జీవితకథ ఆధారంగా జితేంద‌ర్‌రెడ్డి సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు విరించివర్మ (Virinchi Varma). ఈ మూవీ టైటిల్ రోల్ ను బాహుబ‌లి న‌టుడు రాకేష్ వ‌ర్రే పోషిస్తున్నట్లు ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతోంది. ఈ పోస్టర్ లో రాకేష్ చేతితో తుపాకి ప‌ట్టుకొని ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు. తాజా లుక్ వైరల్ గా మారింది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ మూవీపై అంచనాలు పెంచేశాయి. 

జ‌గిత్యాల‌కు చెందిన తొలిత‌రం బీజేపీ నాయ‌కుడు జితేంద‌ర్‌రెడ్డి జీవితంలో జ‌రిగిన య‌థార్థ సంఘ‌న‌ట‌ల‌ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. మజ్ను సినిమా తర్వాత  విరించివ‌ర్మ‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఉయ్యాల జంపాలాతో డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన విరించివ‌ర్మ ఏడేళ్ల తర్వాత ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ముదిగంటి ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మిస్తున్న జితేంద‌ర్‌రెడ్డి సినిమాకు గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. 

బాహుబ‌లి సినిమాతో రాకేష్ వ‌ర్రే (Rakesh Varre) పాపులర్ అయ్యాడు. ఇందులో దేవ‌సేన‌పై చేయివేసి ఆమెను ఇబ్బంది పెట్టే సైనికుడిగా కనిపించి మెప్పించాడు. ఆ తర్వాత 'ఎవ‌రికీ చెప్పొద్దు' సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ ఆకట్టుకుంది. మరి ఇప్పుడు నటించబోతున్న జితేంద‌ర్‌రెడ్డి మూవీ ఇతడి కెరీర్ కు ఏ విధంగా ఫ్లస్ అవుతుందో చూడాలి. 

Also Read: Bigg Boss 7 Eliminations: హౌస్ నుంచి రతిక ఔట్.. బిగ్‌ బాస్‌ హిస్టరీలో ఇదే తొలిసారి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News