Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం.. చేతికి గాయం.. క్లారిటీ ఇదిగో..!

Jr NTR Road Accident News: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Aug 14, 2024, 03:40 PM IST
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం.. చేతికి గాయం.. క్లారిటీ ఇదిగో..!

Jr NTR Road Accident News: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు, వేళ్లకు గాయాలు అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గత రాత్రి హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో తారక్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మూవీలో నటిస్తున్నాడు. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Also Read: Anna Canteen Food Menu: అన్న క్యాంటీన్ లలో ఫుడ్ మెనూ ఇదే.. టైమింగ్స్ సహా పూర్తి  డీటెల్స్.. 

అయితే ఈ వార్తలను అభిమానులు కొట్టిపారేస్తున్నారు. ఎన్టీఆర్ గంట క్రితం కూడా ట్వీట్ చేశారు. నార్నే నితిన్ ఆయ్ మూవీ విడుదల సందర్భంగా ఆల్‌ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు. దేవర పార్ట్-1 మూవీ షూటింగ్ పూర్తి చేసేశాడు తారక్. ఇదే చివరి షాట్ అంటూ షూటింగ్ లొకేషన్‌లో ఉన్న పిక్‌ను షేర్ చేశాడు. సెప్టెంబర్ 27న దేవర మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. పాన్ ఇండియా వైడ్‌గా వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

లేటెస్ట్ అప్‌డేట్‌

తాజాగా ఈ విషయం ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. "జిమ్‌లో ఎన్టీఆర్ వర్కవుట్ చేస్తున్నప్పుడు కొన్ని రోజుల క్రితం ఎడమ మణికట్టుకు చిన్నపాటి బెణుకు వచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా అతని చేతిని కదలించారు. గాయపడినా.. ఎన్టీఆర్ గత రాత్రి దేవర షూటింగ్ పూర్తి చేసి ఇప్పుడు కోలుకుంటున్నారు. రెండు వారాల్లో సెట్ అవుతుంది. త్వరలో కోలుకుని వర్క్ బిజీ అవుతారు." అని వెల్లడించింది.

Also Read: Happy Independence Day 2024: పంద్రాగస్టున అందరినీ ఇలా విష్ చేయండి, టాప్ 10 విషెస్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News