Anna Canteen Food Menu: ప్రస్తుతం పెరిగిన రేట్లతో బయట టిఫిన్స్ కానీ, భోజనాలు చేయడానికి చేతి చమురు ఒదిలించుకోవాల్సిందే. మినిమం టూ మినిమం ఒక టిఫిన్ రూ. 30లకు తక్కువ లేదు. మరోవైపు రోజు వారీ కూలీలు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కు వచ్చే పేద రోగులు, వాళ్ల బంధువులతో పాటు.. ఏదో అవసరమై ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికీ ఎక్కువ రేట్లతో టిఫిన్, భోజనం చేయడం అనేది పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి పేద, బడుకు వర్గాల అన్నార్తుల ఆకలి తక్కువ రేటుతో తీర్చడానికి ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రారంభించిన ‘అన్న క్యాంటీన్’ లను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రూ. 5 కే రుచికరమైన భోజనం అందించేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 15న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లాలోని గుడివాడలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించనున్నారు.
ఈ నెల 16న మిగిలిన 99 అన్న క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రారంభిస్తారు. అన్న క్యాంటీన్ కు కావాల్సిన ఆహార పదార్ధాలు , సరఫరా బాధ్యతలను హరేకృష్ణ మూమెంట్ సంస్థ టెండర్స్ లో దక్కించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 203 క్యాంటీన్స్ ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసారు. అందులో 180 రెడీగా ఉన్నాయి. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం 100 క్యాంటీన్లను ఆహారం సరఫరా చేయనున్నారు. మిగిలిన వాటిని సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభించే యోచనలో ఉంది.
ఈ నెల 16న మిగిలిన 99 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభిస్తారు. ఆహార పదార్థాల తయారీ, సరఫరా బాధ్యతలు హరేకృష్ణ మూవ్‌మెంట్ సంస్థ టెండర్లలో దక్కించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 క్యాంటీన్లలో ప్రస్తుతం 180 సిద్ధమయ్యాయి. ముందుగా వంద క్యాంటీన్లకు భోజనం సరఫరా చేయనున్నారు. మిగిలిన వాటికి ఈ నెలాఖరు లేదా సెప్టెంబరు 5న ప్రారంభించనున్నారు. తాజాగా అన్న క్యాంటీన్లకు సంబంధించిన మెనూను ప్రభుత్వం విడుదల చేసింది. ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో అన్న క్యాంటీన్లను పనిచేస్తాయి. ఈ సందర్భంగా ఆరు రోజులకు సంబంధించిన మెనూను పరిశీలిస్తే..
ఆగస్టు 15వ తేదీ ప్రారంభమయ్యే అన్న క్యాంటీన్ ల మెనూ. #AnnaCanteen pic.twitter.com/5BPwHgF8qX
— Hari Pranay (@HariPranay4) August 13, 2024
సోమవారం అన్న క్యాంటీన్ మెనూ
అల్పాహారం రూ. 5
ఇడ్లీ, చట్నీ లేదా పొడి, సాంబార్ లేదా పూరీ, కుర్మా
మధ్యాహ్న భోజనం / రాత్రి భోజనం
తెల్ల అన్నం, కూర, పప్పు లేదా సాంబార్, పెరుగు, పచ్చడి
మంగళవారం అన్న క్యాంటీన్ మెనూ
అల్పాహారం
ఇడ్లీ, చట్నీ లేదా పొడి, సాంబార్ లేదా ఉప్మా, చట్నీ లేదా పొడి, సాంబార్, మిక్చర్
మధ్యాహ్న భోజనం / రాత్రి డిన్నర్
వైట్ రైస్ , కూర, పప్పు లేదా సాంబార్, పెరుగు, పచ్చడి
బుధవారం అన్న క్యాంటీన్ మెనూ
అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్ )
ఇడ్లీ, చట్నీ లేదా పొడి, సాంబార్ లేదా పొంగల్, చట్నీ లేదా పొడి, సాంబార్, మిక్చర్
తెల్ల అన్నం, పప్పు, కూర లేదా సాంబార్, పెరుగు, పచ్చడి
గురువారం అన్న క్యాంటీన్ మెనూ
అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్ )
ఇడ్లీ, చట్నీ లేదా పొడి, సాంబార్ లేదా పూరీ, కుర్మా
లంచ్ / డిన్నర్
తెల్ల అన్నం, సాంబార్ లేదా పప్పు, పెరుగు, పచ్చడి
శుక్రవారం మెనూ
అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్)
ఇడ్లీ, చట్నీ లేదా పొడి, సాంబార్ లేదా ఉప్మా, చట్నీ లేదా పొడి, సాంబార్, మిక్చర్
మధ్నాహ్న భోజనం / రాత్రి భోజనం
తెల్ల అన్నం, కూర, పప్పు లేదా సాంబార్, పెరుగు, పచ్చడి
శనివారం మెనూ
అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్)
ఇడ్లీ, చట్నీ లేదా పొడి, సాంబార్ లేదా పొంగల్, చట్నీ లేదా పొడి, సాంబార్, మిక్చర్
మధ్నాహ్న భోజనం / రాత్రి భోజనం
తెల్ల అన్నం, కూర, పప్పు లేదా సాంబార్, పెరుగు, పచ్చడి
అన్న క్యాంటీన్ లలో బ్రేక్ ఫాస్ట్ 7.30 -10.00 లంచ్ 12.30 -3.00,
డిన్నర్ 7.30 - 9.00
ఆదివారం సెలవు వారానికి ఒక రోజు స్పెషల్ రైస్ ఉంటుంది.
ఇడ్లీ , పూరీ - 3 Pcs, ఉప్మా, పొంగల్ - 250 గ్రాములు, వైట్ రైస్ -400 గ్రాములు
చట్నీ/ పొడి -15 గ్రాములు.. సాంబార్ - 150 గ్రాములు.. మిక్చర్ -25 గ్రాములు..కూర -100 గ్రాములు
పప్పు 120 గ్రాములు.. పచ్చడి 15 గ్రాములు.. పెరుగు 75 గ్రాములు చొప్పున ఇస్తారు.
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter