K.P.A.C. Lalitha Died: ఇండస్ట్రీని కుదిపేస్తున్న వరుస మరణాలు.. పరిశ్రమలో మరో నటి మృతి

K.P.A.C. Lalitha Died: సినీ పరిశ్రమను వరుస మరణాలు కలవరానికి గురిచేస్తున్నాయి. ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలో విషాధం నెలకొంది. 50 ఏళ్ల సినీ కెరీర్ లో 550కి పైగా సినిమాల్లో నటించిన కేపీఏసీ లలిత తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆమె.. మంగళవారం రాత్రి కన్నుమూశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2022, 08:30 AM IST
    • భారతీయ చిత్ర పరిశ్రమలో మరో విషాదం
    • మలయాళ సీనియర్ నటి కేపీఏసీ లలిత మృతి
    • అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన లలిత
K.P.A.C. Lalitha Died: ఇండస్ట్రీని కుదిపేస్తున్న వరుస మరణాలు.. పరిశ్రమలో మరో నటి మృతి

K.P.A.C. Lalitha Died: భారతీయ చిత్ర పరిశ్రమను వరుస మరణాలు కుదిపేస్తున్నాయి. మలయాళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు మరో విషాదం నెలకొంది. సీనియర్ నటి కేపీఏసీ లలిత మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేపీఏసీ లలిత.. ఇటీవలే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. మంగళవారం రాత్రి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడం వల్ల మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 

కేపీఏసీ లలిత సినీ ప్రయాణం

కేపీఏసీ లలిత అసలు పేరు మహేశ్వరి అమ్మ. దాదాపుగా 50 ఏళ్ల సినిమా కెరీర్ లో ఆమె 550కి పైగా సినిమాల్లో నటించారు. మలయాళం సినిమా కమర్షియల్ అండ్ ఆర్ట్ స్కూల్ లో రాణించారు. చివరిగా కేరళకు చెందిన సంగీత నాటక అకాడమీకి ఆమె ఛైర్ పర్సన్ గా ఉన్నారు. లలిత.. తన నటనకు గానూ రెండు జాతీయ అవార్డులు, నాలుగు రాష్ట్ర పురస్కారాలను అందుకున్నారు. 

మలయాళ చిత్ర నిర్మాత భరతన్ ను కేపీఏసీ లలిల వివాహమాడారు. వీరికి ఇద్దరు సంతానం. సిద్ధార్థ్ భరతన్, కుమార్తె శ్రీకుట్టి భరతన్. లలిత మరణవార్త విన్న సౌత్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేశారు. మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్, కీర్తి సురేష్, మంజూ వారియర్ వంటి వారు కేపీఏసీ లలిత జ్ఞాపకాలను గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు.  

Also Read: Bheemla Nayak Pre Release Event: పవన్ ఫ్యాన్స్‌కు కీలక సూచన.. ఆ పాసులు చెల్లవు.. అమల్లోకి ట్రాఫిక్ ఆంక్షలు

Also Read: నెరవేరిన సుక్కూ కల.. మెగాస్టార్‌ను డైరెక్ట్ చేయనున్న లెక్కల మాష్టారు.. ట్విస్ట్ ఏంటంటే...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News