Kajal Agarwal: సూపర్ స్టార్ డిజాస్టర్ సినిమాని తన ఫేవరెట్ అన్న కాజల్.. ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్

Kajal Agarwal Favourite Movie: ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన తదుపరి సినిమా సత్యభామ ప్రమోషన్స్ లో తెగ యాక్టివ్ గా పాల్గొంటుంది. ఈ క్రమంలో ఎన్నో ఇంటర్వ్యూలు అత్యంత అవుతూ ఎన్నో ఆసక్తికర విషయాలు తెలియజేస్తోంది ఈ హీరోయిన్..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 22, 2024, 10:25 PM IST
Kajal Agarwal: సూపర్ స్టార్ డిజాస్టర్ సినిమాని తన ఫేవరెట్ అన్న కాజల్.. ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్

Kajal Aggarwal: తేజ దర్శకత్వంలో కళ్యాణ్రామ్ హీరోగా వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కాజల్. అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అప్పటినుంచి నిజంగానే తెలుగు సినిమా ఇండస్ట్రీ చందమామగా మారిపోయింది ఈ హీరోయిన్. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోయిన కాజల్ ఈ మధ్య పెళ్లి చేసుకోవడంతో చిత్రాలకు కొంచెం గ్యాప్ ఇచ్చింది.

అయితే ఈ మధ్యనే బాల కృష్ణ భగవంత్ కేసరి సినిమాలు తిరిగి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇప్పుడు సత్యభామ అనే సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది. కాగా ఈ సినిమా కథ మొత్తం కాజల్ పాత్ర చుట్టూనే తిరగడంతో.. ఈ సినిమా ప్రమోషన్స్ లో తెగ యక్టివ్ గా పాల్గొంటుంది ఈ హీరోయిన్. ఈ క్రమంలో కాజల్ అగర్వాల్ ఈమధ్య వచ్చిన ఒక ఇంటర్వ్యూలో డిజాస్టర్ సినిమాని తన ఫేవరెట్ సినిమా అనడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అసలు విషయానికి వస్తే కాజల్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన టాప్ 3 సినిమాలు చెప్పమని యాంకర్ అడగగా.. కాజల్ సమాధానమిస్తూ.. ‘మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా నాకు చాలా ఇష్టం. అందులో నా క్యారెక్టర్ నాకు రియల్ లైఫ్ క్యారెక్టర్ కి చాలా దగ్గరగా ఉంటుంది’ అని తెలిపింది. 

ఇక కాజల్ బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్నో ఉండగా ఇలా డిజాస్టర్ సినిమాని తన ఫేవరెట్ అనడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. బ్రహ్మోత్సవం సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే డిజాస్టర్ సినిమా. అంతేకాకుండా ఈ సినిమాని సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ కూడా చేశారు. ఫ్యామిలీ డ్రామాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ పరాజయం చూసింది. ఆఖరికి సూపర్ స్టార్ మహేష్ అభిమానులు కూడా ఈ సినిమా చూసి తల పట్టుకున్నారు. ఈ సినిమాలో కాజల్ తో పాటు ప్రణీత, సమంత కూడా హీరోయిన్స్ గా చేశారు. అయితే వీరి గ్లామర్ కూడా ఈ సినిమాని కాపాడలేకపోయింది. కానీ ఇప్పుడు కాజల్ ఈ చిత్రం గురించి ఎట్టి..అది తన ఫేవరెట్ మూవీ అనడం.. నిజంగా ఆశ్చర్యకర విషయమే.

 

 

Also read: Jio Prepaid plan Offers: ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకుంటే ఉచితంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్, జీ5

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News