Tollywood Upcoming Sequels: తెలుగులో రాబోతున్న సీక్వెల్స్ ఇవే.. ఏకంగా డజన్ సినిమాలు!

Tollywood Sequels: ఈ మధ్య బాగా హిట్ అయిన సినిమాలకి సీక్వెల్స్ తీయడం, లేదా ప్యాన్ ఇండియన్ సినిమాలను రెండు మూడు భాగాలుగా తీయడం.. తెలుగు ఫిల్మ్ మేకర్స్ కి బాగా అలవాటు అయిపొయింది. ఇప్పుడు కూడా చాలానే సినిమాల సీక్వెల్స్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాయి. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 20, 2024, 10:22 PM IST
Tollywood Upcoming Sequels: తెలుగులో రాబోతున్న సీక్వెల్స్ ఇవే.. ఏకంగా డజన్ సినిమాలు!

Upcoming Telugu Sequels: తెలుగులో వచ్చి హిట్ అయిన సినిమాలకు.. ఇప్పుడు ఆసక్తికరమైన సీక్వెల్స్ రాబోతున్నాయి. ఆ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పుష్ప - ది రూల్:
  అల్లు అర్జున్, సుకుమార్ కాంబో లో పుష్ప: ది రైజ్ సక్సెస్ తర్వాత.. రాబోతున్న సీక్వెల్ ఇది. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ ప్రేక్షకులను మరొకసారి ఇంప్రెస్స్ చేయనున్నారు.  

సలార్ పార్ట్ 2:
  ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో.. రూపొందించిన బ్లాక్ బస్టర్ సినిమా సలార్ కి సీక్వెల్ ఇది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఈ సినిమాలో కూడా ఇంటెన్స్ యాక్షన్ డ్రామాను ప్రేక్షకులకు అందించనున్నారు.

కల్కి 2898AD పార్ట్ 2: 
ఈమధ్యనే సైన్స్ ఫిక్షన్ సినిమాగా వచ్చిన కల్కి 2898 AD 1000 కోట్ల వసూళ్లు.. నమోదు చేసుకుంది. దానికి రెండవ భాగం కల్కి 2 కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

డబుల్ ఇస్మార్ట్:
  రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ సినిమాకి.. సీక్వెల్ ఇది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని ఫ్యాన్స్ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

హిట్ కేస్ 3:
  విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో.. నటించిన హిట్ సినిమా, అడవి శేషు హీరోగా నటించిన హిట్ 2 రెండు మంచి విజయాలను అందుకున్నాయి. హిట్ సిరీస్ లో భాగంగా ఇప్పుడు మూడవ సినిమా లో నాని హీరోగా నటిస్తున్నారు.

జై హనుమాన్: 

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ.. దర్శకత్వంలో చిన్న బడ్జెట్ సినిమాగా విడుదలైన హనుమాన్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయింది. హనుమాన్ యూనివర్స్.. లో భాగంగా ఇప్పుడు రెండవ సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతోంది.

కార్తికేయ పార్ట్ 3:
 నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన కార్తికేయ సిరీస్ లోని మూడవ భాగం ఈసారి మరింత మిస్టరీ, సస్పెన్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

గూఢాచారి పార్ట్ 2:
  అడివి శేష్ హీరోగా నటించిన.. గూఢాచారి సినిమా ఒక సీక్రెట్ ఏజెంట్ కథగా ప్రేక్షకులను.. మళ్ళీ సీట్లకు కట్టిపడేసింది. ఆ చిత్ర సీక్వెల్ గూఢాచారి పార్ట్ 2 మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

బింబిసార పార్ట్ 2:

కళ్యాణ్ రామ్ నటించిన పీరియడ్ ఫాంటసీ సినిమా ఒక చారిత్రక కథ..ఆధారంగా రూపొందించబడింది. తొలి భాగం పెద్ద విజయాన్ని సాధించింది. దాని సీక్వెల్ గా ఈ చిత్రం అనిల్ పాడురి దర్శకత్వంలో తెరకెక్కనుంది.

టిల్లు క్యూబ్:
 సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ రెండు సినిమాలు.. బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. దానికి సీక్వెల్ గా ఇప్పుడు టిల్లు క్యూబ్ త్వరలో ప్రేక్షకులను అలరించనుంది.

పొలిమేర పార్ట్ 3:

సత్యం రాజేష్ హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ పొలిమేర రెండు భాగాలు మంచి విజయాలను అందుకున్నాయి. దానికి మూడవ భాగంగా.. ఇప్పుడు పొలిమేర పార్ట్ 3 రాబోతోంది. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. 

మాడ్ మ్యాక్స్:
 గతేడాది సంగీత్ శోభన్ హీరోగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా విడుదలైన మ్యాడ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్.. అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకి సీక్వెల్ గా మాడ్ మాక్స్ త్వరలో ప్రేక్షకులం ముందుకు రాబోతోంది.

Read more: SPos lathi charge: సీఎం నివాసంలో హైటెన్షన్.. పోలీస్ వర్సెస్ పోలీస్.. ఒకరిపై మరోకరు లాఠీచార్జీ.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News