Kalki 2898 AD OTT: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ ఓటీటీ పార్టనర్ లాక్.. ఎపుడు ఎక్కడంటే..

Kalki 2898 AD OTT Partner Streaming: రెబల్ స్టార్ ప్రభాస్, దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించిన సినిమా ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నఈ సినిమా ఓటీటీ పార్టనర్ కూడా లాక్ అయింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 27, 2024, 12:01 PM IST
Kalki 2898 AD OTT: ప్రభాస్ ‘కల్కి 2898 AD’  మూవీ ఓటీటీ పార్టనర్ లాక్.. ఎపుడు ఎక్కడంటే..

Kalki 2898 AD OTT Partner Streaming:  ప్రస్తుతం మన దర్శకులందరు సినిమాటిక్ యూనివర్స్ అంటూ కొత్త సినీ వండర్ కు తెర లేపారు. ఈ కోవలో నాగ్ అశ్విన్ కూడా ‘కల్కి’ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఫస్ట్ మూవీ ‘కల్కి 2898AD’ అంటూ సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మన భారత ఇతిహాసానికి సైన్స్ ఫిక్షన్ జోడించి భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉండబోతుందనే విషయాన్ని ‘కల్కి’ మూవీలో  చూపెట్టాడు. అంతేకాదు మనకు తెలియని సరికొత్త ప్రపంచాన్ని తెలుగు సహా భారతీయ ప్రేక్షకులకు చూపెట్టడంలో సక్సెస్ అయ్యడనే చెప్పాలి.

ముఖ్యంగా ప్రభాస్ భైరవ క్యారెక్టర్..సప్త చిరంజీవిల్లో ఒకరైన అశ్వత్థమా పాత్రలో అమితాబ్.. యాస్కిన్ సుప్రీమ్ పాత్రలో కమల్ హాసన్ నటన గురంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొత్తంగా హాలీవుడ్ రేంజ్ లో విజువల్ వండర్ క్రియేట్ చేసాడు. తాజాగా ఈ సినిమా ఓటీటీ పార్టనర్ లాక్ అయింది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. ఈ సినిమా విడుదలైన 7 వారాల తర్వాత ఈ సినిమా 5 భాషల్లో స్ట్రీమింగ్ రానుంది.

ఇదీ చదవండి: ‘కల్కి 2898 AD’ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే ‘కల్కి’ సినిమాటిక్ యూనివర్స్..

ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వారు దాదాపు రూ. 400 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. మరోవైపు శాటిలైట్ రైట్స్ కూడా దాదాపు రూ. 200 కోట్లకు అమ్ముడు పోయింది. దీంతో ఈ సినిమా నటీనటులు పారితోషికం సహా మొత్తం సినిమా రూ. 600 కోట్లు అయింది. మొత్తంగా ఈ అమౌంట్ డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారానే రికవరీ అయింది. ఈ సినిమా మొదటి రోజే దాదాపు రూ. 200 కోట్లు రాబట్టే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

ఇదీ చదవండి: మన దేశంలో వారాహీ అమ్మవారు దేవాలయాలు ఎక్కడున్నాయి.. వాటి ప్రత్యేకతలు ఏమిటంటే.. !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News