Kalki 2898AD: అశ్వినీ దత్ కాళ్లు మొక్కిన అమితాబ్.. నాగ్ అశ్విన్.. ఏమి తాగాడో అంటూ కామెంట్స్

Kalki Pre Release Event: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో.. జూన్ 27న విడుదల అవుతున్న సినిమా కల్కి. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరుగగా.. అందులో మాట్లాడుతూ అమితాబ్ బచ్చన్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 20, 2024, 07:59 AM IST
Kalki 2898AD: అశ్వినీ దత్ కాళ్లు మొక్కిన అమితాబ్.. నాగ్ అశ్విన్.. ఏమి తాగాడో అంటూ కామెంట్స్

Kalki 2898AD Review: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. కాంబోలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా.. కల్కి 2898 ఏడి. భారీ అంచనాల మధ్య.. ఈ సినిమా ఈ నెల 27 వ తేదీన.. ప్రపంచవ్యాప్తంగా ధియేటర్ లలో విడుదలకి సిద్ధం అవుతోంది. 

తాజాగా సినిమా ప్రమోషన్స్ తో.. బిజీగా ఉన్న చిత్ర బృందం.. నిన్న అంటే జూన్ 19 న ముంబై లో భారీ స్థాయిలో.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ప్రభాస్, నాగ్ అశ్విన్ తో పాటు సినిమాలో కీలక పాత్రలలో… నటిస్తున్న అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు… కూడా ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.బాహుబలి సమయం నుండి.. ప్రభాస్ కి స్నేహితుడు అయిన రానా దగ్గుబాటి.. ఈ ఈవెంట్ లో హోస్ట్ గా ఇంప్రెస్స్ చేశారు.  

అయితే అందులో మరీ ముఖ్యంగా.. అమితాబ్ బచ్చన్ చిత్ర డైరెక్టర్ నాగ్ అశ్విన్.. గురించి చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. ముందుగా వేదిక మీద ఉన్నప్పుడు అమితాబ్ బచ్చన్..చిత్ర నిర్మాత అశ్విని దత్ సెట్స్ లో తమని.. చాలా బాగా చూసుకున్నారు అని చెబుతూ..ఆయన కాళ్ళ మీద పడటం అందరినీ షాక్ కి గురి చేసింది. అయితే నాగ్ అశ్విన్ ఈ సినిమా కథ నేరెట్ చేసినప్పుడు తన రియక్షన్ గురించి అమితాబ్ చాలా బాగా చెప్పుకొచ్చారు. 

"నా దగ్గరికి నాగ్ అశ్విన్ వచ్చి కథను.. వినిపించినప్పుడు ఇలాంటి అద్భుతమైన కథ తనకి ఏం తాగితే వచ్చి ఉంటుంది.. అని అనిపించింది. కథ అంత ఫ్యూచరిస్టిక్ గా ఉంది. అసలు తను ఎలా ఇలాంటి ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడు.. అని అనిపించింది. మేము చిత్రీకరించిన ప్రతి విజువల్ నాగ్ అశ్విన్ మైండ్ నుండి వచ్చినవే. నేను కూడా ఈ సినిమాలో… ఒక చిన్న భాగం కావడం నా అదృష్టం. సినిమా షూటింగ్ నేను జీవితంలో మర్చిపోలేని ఒక అద్భుతమైన అనుభవం" అంటూ నాగ్ అశ్విన్ ని ఆకాశానికి ఎత్తేశారు అమితాబ్ బచ్చన్.  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News