Kanguva: సూర్య.. బాబీ డియోల్ బీభత్సం.. ఆకట్టుకుంటున్న కంగువ టీజర్

Kanguva Teaser: తమిళం తో పాటు తెలుగులో కూడా ఎంతో పేరు సంపాదించుకున్న హీరో సూర్య. కాగా సూర్య నుంచి రాబోతున్న మొదటి పాన్ ఇండియా చిత్రం కంగువ. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో అదరగొడుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 19, 2024, 06:24 PM IST
Kanguva: సూర్య.. బాబీ డియోల్ బీభత్సం.. ఆకట్టుకుంటున్న కంగువ టీజర్

Kanguva Teaser: సూర్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కంగువ టీజర్ ఫైనల్ గా ఈరోజు సాయంత్రం విడుదలయింది. తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ హీరోగా చోటు సంపాదించుకున్న సూర్య ఈ చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ మధ్యనే యానిమల్ సినిమాలో కనిపించి దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న బాబీ డియల్ ఈ చిత్రంలో విలన్ గా కనిపించనున్నారు. 

స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తుండగా ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టైటిల్ గ్లింప్స్ అండ్ పోస్టర్స్.. సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా ఈ చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ చేసారు. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచడానికి ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసారు.

ఈ చిత్ర టీజర్ ఆధ్యాంతం ఎంతో ఆసక్తిగా కొనసాగింది. ముఖ్యంగా ఈ టీజర్ మొత్తం డైలాగ్స్ లేకుండా నడిపించేశారు. కానీ విజువల్ గా మాత్రం గూస్‌బంప్స్ తెప్పించారు దర్శకుడు. అడవి, భయంకరమైన ఆదివాసులు, ఖడ్గమృగాలు, సముద్రం.. అద్భుతమైన విఎఫ్ఎక్స్ .. కొన్ని గూస్ బంప్స్ షాట్స్ తో ఒక కొత్త లోకాన్ని చూపించారు. ముఖ్యంగా సూర్యా బాబీ డియోల్ మధ్య వచ్చే సన్నివేశాలు టీజర్ కి హైలైట్ గా నిలిచాయి. ఒక పీరియాడికల్ సబ్జెట్ ని శివ లాంటి కమర్షియల్ డైరెక్టర్ ఈ రేంజ్ లో చూపించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మొత్తంగా ఈ సినిమా టీజర్ అయితే ఆడియన్స్ తో వావ్ అనిపించేలా ఉంది.

ఇక ఈ చిత్రం కథ మూడు టైం పీరియడ్స్ తో ఉండబోతుందని సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం కథ లో భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను దర్శకుడు చూపించబోతున్నారట. అయితే ఈ టీజర్ లో మాత్రం ఒక కాలమే చూపించగా.. మరి మిగతా కాలాలకు సంబంధించిన టీజర్ లు కూడా త్వరలో వస్తాయేమో చూడాలి. కాగా ఈ చిత్రం 3Dలో మొత్తం 38 భాషల్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారు.. ఈ చిత్ర విడుదల తేదీ ఏమిటి అన్న విషయాన్ని మాత్రం ఇంకా తెలియజేయలేదు.

Also Read: TamiliSai: "బాధగా ఉంది.. కానీ తప్పడం లేదు": రాజ్‌భవన్‌ ఖాళీ చేసిన తమిళిసై

Also Read: Kavitha: కవిత అరెస్ట్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. ఘాటెక్కిన రాజకీయం

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News