Kajal Aggarwal in Kannappa: కన్నప్పలో కాజల్ అగర్వాల్.. మంచు విష్ణు ప్లాన్ మాములుగా లేదుగా..

Kajal Aggarwal in Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' మూవీలో స్టార్ కాస్ట్ అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఇప్పటికే ఈ సినిమా మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. తాజాగా కన్నప్ప సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తుందంటూ మంచు విష్ణు స్వయంగా ప్రకటించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : May 17, 2024, 03:27 PM IST
Kajal Aggarwal in Kannappa: కన్నప్పలో కాజల్ అగర్వాల్.. మంచు విష్ణు ప్లాన్ మాములుగా లేదుగా..

Kajal Aggarwal in Kannappa: మంచు విష్ణు తన జీవిత కాలపు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడటం లేదు. ఈ సినిమా కోసం అద్భుతమైన స్టార్ క్యాస్ట్‌తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేసాడు. క‌న్న‌ప్ప‌లో మంచు విష్ణు టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇప్పటికే  బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన క్యారెక్టర్‌కు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసారు.  ఆ తరువాత రెబల్ స్టార్ ప్రభాస్‌ సెట్‌లోకి రావడం.. ఇలా ప్రతీ ఒక్క అప్డేట్‌తో కన్నప్ప నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతూనే వస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ మహాశివుడిగా కనిపించనున్నట్టు తెలుస్తుంది. తాజాగా తాజాగా కన్నప్పకు సంబంధించిన మరో అప్డేట్ నెట్టింట్లో వైరల్ కాసాగింది.

కన్నప్ప చిత్రంలోని ఓ కీలక పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ మేరకు చిత్రయూనిట్ అఫిషియల్‌గా ప్రకటించారు. ఆల్రెడీ విష్ణు మంచు, కాజల్ కలిసి ఇది వరకు మోసగాళ్లు మూవీని చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలా మంచు విష్ణు టైటిల్ రోల్‌లో చేస్తోన్న కన్నప్ప చిత్రంలో కాజల్ ఓ కీ రోల్‌ను పోషిండం విశేషం. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్.. ప్రభాస్ సరసన పార్వతి మాత పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

ఈ సినిమాను టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ చేస్తున్నారు.
ఈ మూవీని ఎక్కువగా న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైద్రాబాద్‌లో జరుగుతోంది. మే 20న కేన్స్‌లో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్‌లో కన్నప్ప టీజర్‌ను లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. మొత్తంగా స్టార్ క్యాస్ట్‌తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Read more: Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News