Kareena Kapoor Prabhas: టాలీవుడ్ స్టార్ హీరోకు జోడీగా క‌రీనా క‌పూర్‌!

Kareena Kapoor play a key role in Prabhas Spirit Movie. స్పిరిట్ సినిమాలో ప్ర‌భాస్‌కు జోడీగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ క‌రీనా క‌పూర్‌ నటించనుంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 8, 2022, 04:21 PM IST
  • టాలీవుడ్ స్టార్ హీరోకు జోడీగా క‌రీనా క‌పూర్‌
  • క‌రీనాతో చ‌ర్చ‌లు
  • త్వ‌ర‌లోనే నిర్ణ‌యం
Kareena Kapoor Prabhas: టాలీవుడ్ స్టార్ హీరోకు జోడీగా క‌రీనా క‌పూర్‌!

Kareena Kapoor play a key role in Prabhas Spirit Movie: 'బాహుబలి' సినిమాతో టాలీవుడ్ హీరో ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దాంతో ప్ర‌భాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. ఇటీవ‌ల విడుద‌లైన ‘రాధేశ్యామ్’ భారీ ఫ్లాప్ అవ‌డంతో.. ప్ర‌భాస్ త‌న త‌దుప‌రి సినిమాల‌ కథలపై ఫుల్ ఫోక‌స్‌ పెట్టాడు. ప్ర‌స్తుతం రెబల్ స్టార్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకోగా.. స‌లార్‌, ప్రాజెక్ట్‌-K చిత్రాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి.

అర్జున్ రెడ్డి సినిమాతో పెద్ద హిట్ కొట్టిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ 'స్పిరిట్' చిత్రాన్ని చేయ‌నున్నాడు. ఈ సినిమా ప్ర‌భాస్‌కు 25వది కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే ప్ర‌భాస్ కోసం ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ క్యారెక్ట‌ర్‌ను సందీప్ డిజైన్ చేశాడ‌ట‌. ఈ సినిమా కోసం ఇప్ప‌టికే సందీప్ స్క్రిప్ట్‌ను కూడా సిద్ధం చేశాడట. అయితే స్పిరిట్ సినిమాలో ప్ర‌భాస్‌కు జోడీగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ క‌రీనా క‌పూర్‌ను ఎంపిక చేసే ప‌నిలో ఉన్నాడ‌ట‌ సందీప్. ఇప్ప‌టికే క‌రీనాతో చ‌ర్చ‌లు జ‌రుప‌గా.. ఆమెకు కథ నచ్చిందట. త్వ‌ర‌లోనే త‌న నిర్ణ‌యం చెప్తాన‌ని తెలిపిన‌ట్లు సమాచారం. మరో ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ప్ర‌స్తుతం సందీప్ రెడ్డి వంగా, ర‌ణ్‌బీర్‌తో ‘యానిమ‌ల్’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. టాలీవుడ్ బ్యూటీ ర‌ష్మిక మందన్న హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్.. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న యానిమ‌ల్.. వ‌చ్చే ఏడాది ద్వితియార్థంలో విడుద‌ల కానుంది. యానిమ‌ల్ సినిమా అనంతరం సందీప్, ప్రభాస్ తమ స్పిరిట్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు. 

Also Read: Rains Alert: తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్..అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ..!

Also Read: Vamana Dwadashi 2022: వామన ద్వాదశి ఎప్పుడు? ఈ రోజున ఏం చేయాలి?

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News