Good Luck Sakhi Trailer: అబద్దాలు ఆడేదానిలా కనిపిస్తుండానా.. నన్ను పెళ్లిసేసుకుంటావా: కీర్తి సురేశ్‌

Keerthy Suresh Good Luck Sakhi Trailer: సురేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గుడ్‌ లక్‌ సఖి' ట్రైలర్‌ను చిత్రబృందం సోషల్‌ మీడియా వేదికగా పంచుకొంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2022, 11:45 AM IST
  • నేను నిజంగానే బ్యాడ్‌లక్‌ సఖి
  • అబద్దాలు ఆడేదానిలా కనిపిస్తుండానా
  • నన్ను పెళ్లిసేసుకుంటావా
Good Luck Sakhi Trailer: అబద్దాలు ఆడేదానిలా కనిపిస్తుండానా.. నన్ను పెళ్లిసేసుకుంటావా:  కీర్తి సురేశ్‌

Keerthy Suresh Good Luck Sakhi Trailer: స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గుడ్‌ లక్‌ సఖి' (Good Luck Sakhi). క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని నగేష్‌ కుకునూరు (Nagesh Kukunoor) దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రైఫిల్‌ షూటర్‌ పాత్రలో కీర్తి, కోచ్‌ పాత్రలో సీనియర్ హీరో జగపతి బాబు నటించారు. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన గుడ్‌ లక్‌ సఖి సినిమా జనవరి 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం చిత్రబృందం ట్రైలర్‌ను సోషల్‌ మీడియా వేదికగా పంచుకొంది.

'మన దేశం గర్వపడేలా షూటర్స్‌ని తయారు చేయబోతున్నాను' అని జగపతి బాబు చెప్పే డైలాగ్‌లతో ట్రైలర్‌ (Good Luck Sakhi Trailer) ప్రారంభం అవుతుంది. 'అందరూ నన్ను బ్యాడ్‌లక్‌ సఖి అంటుంటారు. మనకి అటాంటి సోది కబుర్లు మీద నమ్మకం లేదు', 'అబద్దాలు ఆడేదానిలా కనిపిస్తుండానా', 'అమ్మాయిలు షూటింగ్ చేయడం కరెక్ట్ కాదు', 'ఆ అమ్మి లక్కు అంతంత్ర మాత్రమే', 'నన్ను పెళ్లిసేసుకుంటావా' అనే డైలాగ్స్ బాగున్నాయి. ట్రైలర్‌లో కీర్తి సురేశ్‌ చెప్పే డైలాగ్‌లు, ఆమె నటన అందరిని ఆకట్టుకుంటోంది.

Also Read: KL Rahul Record: కేఎల్ రాహుల్ ఖాతాలో చెత్త రికార్డు.. తొలి భార‌త కెప్టెన్‌గా!!

షూటింగ్‌ ప్రధానాంశంగా సాగే 'గుడ్‌ లక్‌ సఖి' కథలో కీర్తి సురేశ్‌ 'సఖి' అనే గ్రామీణ యువతి పాత్ర పోషించారు. సఖికి శిక్షణ ఇచ్చే వ్యక్తిగా జగపతి బాబు (Jagapathi Babu) కనిపించనున్నారు. ఆది పినిశెట్టి (Aadhi Pinisetty), రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. తన గ్రామంలో ఉన్న వారందరి చేత బ్యాడ్‌లక్‌ సఖిగా పిలిపించుకున్న ఆమె.. దేశ వ్యాప్తంగా ఎలా గుర్తింపు తెచ్చుకున్నారు? ఆమె జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. దిల్‌ రాజు సమర్పణలో సుధీర్‌ చంద్ర పదిరి నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ (DSP) సంగీతం అందించాడు.

Also Read: Trolls on Rashmika: అయ్యయ్యో మన 'శ్రీవల్లీ' ప్యాంట్ వేసుకోవటం మర్చిపోయిందా..? రష్మికపై నెటిజన్లు ట్రోల్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News