KL Rahul Bags Unwanted Record: మూడు వన్డే మ్యాచుల సిరీసులో భాగంగా కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో ఉత్కంఠ భరితంగా సాగిన మూడో వన్డే (IND vs SA 3rd ODI)లో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. భారత్‌పై 4 పరుగుల తేడాతో ప్రోటిస్ విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో అతిథ్య దక్షిణాఫ్రికా (South Africa) క్లీన్ స్వీప్ చేసింది. గాయం కారణంగా రోహిత్ శర్మ (Rohit Sharma) దూరం కాగా.. కేఎల్ రాహుల్ భారత వన్డే జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు.
రోహిత్ శర్మ గైర్హజరీలో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ (KL Rahul) అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. మెదటి మూడు వన్డేల్లో ఓడిన తొలి భారత కెప్టెన్‌గా రాహుల్ నిలిచాడు. ఇప్పటి వరకు ఏ భారత కెప్టెన్ కూడా తన తొలి మూడు వన్డేలు ఓడిపోలేదు. దాంతో ఆ చెత్త రికార్డు రాహుల్ (KL Rahul Unwanted Record) పేరుపై నమోదైంది. ఇక ఈ సిరీస్‌లో కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా రాహుల్ విఫలమయ్యాడు. మూడు వన్డేల్లో వరుసగా 12, 55, 9 పరుగులు చేశాడు. రెండో వన్డేలో 55 పరుగులు చేసినా.. అందుకు 79 బంతులు తీసుకున్నాడు.
Also Read: Deepak Chahar Tears: కన్నీళ్లు పెట్టుకున్న దీపక్ చహర్.. కారణం ఏంటంటే? (వీడియో)!!
వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీకి (KL Rahul Bags Captaincy) ప్రమాదం వచ్చిందనే చెప్పాలి. వన్డే, టీ20లకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నప్పుడు రాహుల్‌కి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. రోహిత్ గైర్హాజరీలో సారథిగా మారి విఫలమయ్యాడు. కెప్టెన్‌గా రాహుల్ నిర్ణయాలు కూడా మ్యచ్‌ను ప్రభావితం చేయలేకపోయాయి. కెప్టెన్సీలో సరైన వ్యూహం మిస్సయింది. రాహుల్ తన ఆటగాళ్లలో అత్యుత్తమ ప్రదర్శనను కూడా పొందలేకపోయాడు. కీలక భాగస్వామ్యాలు విడదీయలేకపోయాడు. బౌలర్లను ఉపయోగించుకోవడంలో విఫలమయ్యాడు.
Also Read: India Covid-19 Update: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..మెుత్తం కేసులు ఎన్నంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
KL Rahul Record: కేఎల్ రాహుల్ ఖాతాలో చెత్త రికార్డు.. తొలి భారత కెప్టెన్‌గా!!
మూడో వన్డేలో టీమిండియా ఓటమి
రాహుల్ ఖాతాలో చెత్త రికార్డు
తొలి భారత కెప్టెన్‌గా రాహుల్