KGF 2 Actor Yash వీరాభిమాని ఆత్మహత్య, Suicide Noteలో ఫ్యాన్ ఏం కోరాడో తెలుసా

 కేజీఎఫ్ 2 స్టార్, రాకీ భాయ్ యష్ వీరాభిమాని ఆత్మహత్య చేసుకోవడంతో బెంగళూరులో విషాదం నెలకొంది. యష్ ఫ్యాన్ ఆత్మహత్య చేసుకోవడంతో పాటు నటుడికి తన చివరి కోరిక తెలుపుతూ సూసైడ్ నోట్ సైతం రాయడం హాట్ టాపిక్‌గా మారింది.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 19, 2021, 05:07 PM IST
  • కేజీఎఫ్ 2 స్టార్, రాకీ భాయ్ యష్ వీరాభిమాని ఆత్మహత్య
  • నటుడికి తన చివరి కోరిక తెలుపుతూ సూసైడ్ నోట్
  • వ్యక్తిగత, కుటుంబ సమస్యలతో 25 ఏళ్ల యువకుడు ఆత్మహత్య
KGF 2 Actor Yash వీరాభిమాని ఆత్మహత్య, Suicide Noteలో ఫ్యాన్ ఏం కోరాడో తెలుసా

KGF 2 Actor Yash: కేజీఎఫ్ 2 స్టార్, రాకీ భాయ్ యష్ వీరాభిమాని ఆత్మహత్య చేసుకోవడంతో బెంగళూరులో విషాదం నెలకొంది. యష్ ఫ్యాన్ ఆత్మహత్య చేసుకోవడంతో పాటు నటుడికి తన చివరి కోరిక తెలుపుతూ సూసైడ్ నోట్ సైతం రాయడం హాట్ టాపిక్‌గా మారింది.

కర్ణాటకలోని మండ్యా జిల్లాలోని కొడిదొడ్డి గ్రామానికి చెందిన రామక్రిష్ణ అనే యువకుడు స్టార్ హీరో యష్(Actor Yash)‌కు అభిమాని. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు సైతం అతడు ఫ్యాన్. రామక్రిష్ణ స్వగ్రామం కొడిదొడ్డి బెంగళూరు నుంచి 105 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఏదో వ్యక్తిగత కారణాలు, కుటుంబ సమస్యలతో 25 ఏళ్ల యువకుడు రామక్రిష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. 

Also Read: Traffic Rules: ఇకనుంచి జరిమానాలు ఉండవు, ఏకంగా Driving License శాశ్వతంగా రద్దు

అయితే తన చివరి కోరిక తీర్చాలంటూ సూసైడ్ నోట్ రాశాడు. తాను ఎంతగానో అభిమానించే హీరో యష్, కర్ణాటక(Karnataka) మాజీ సీఎం సిద్ధరామయ్యలు తన అంత్యక్రియలకు హాజరుకావాలని ఆత్మహత్య లేఖలో రామక్రిష్ణ పేర్కొన్నాడు. అభిమాని సూసైడ్‌పై యష్ స్పందించాడు. అభిమానులు ఆత్మహత్య చేసుకోవద్దని సూచించాడు. రామక్రిష్ణ ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశాడు.

Also Read: Radhe Shyam updates: కృష్ణం రాజు, Prabhas కలిసి స్టెప్పేస్టే..

సిద్ధరామయ్య సైతం యువకుడి మరణంపై స్పందించారు. ‘ఇప్పటివరకూ నేనెప్పుడూ అతడిని కలవలేదు. కానీ ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం చాలా బాధాకరమని, ఇలా బలవన్మరణాలకు పాల్పడవద్దని సూచిస్తూ’ ట్వీట్ చేశారు.

Also Read: Brahmastra: బాలీవుడ్‌లో పూర్తి చేసిన కింగ్ Nagarjuna, అప్పుడే టాలీవుడ్‌లో మరో షూటింగ్ షురూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News