KGF Chapter 3: కేజీఎఫ్ ఛాప్టర్ 3 షూటింగ్ ఎప్పుడో చెప్పెసిన నిర్మాతలు

KGF Chapter 3: భారత చలన చిత్ర పరిశ్రమలో మెగా హిట్ సినిమాల్లో ఒకటి కేజీఎఫ్. విడుదలైన రెండు భాగాలు అద్భత విజయాన్ని సాధించాయి. ఇప్పుడిక మూడవ భాగం కోసం సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 8, 2023, 10:46 PM IST
KGF Chapter 3: కేజీఎఫ్ ఛాప్టర్ 3 షూటింగ్ ఎప్పుడో చెప్పెసిన నిర్మాతలు

కేజీఎఫ్ అభిమానులకు శుభవార్త. కేజీఎఫ్ ఛాప్టర్ 1, 2 తరువాత ఇప్పుడిక కేజీఎఫ్ చాప్టర్ 3 కోసం నిరీక్షణ కొనసాగుతోంది. కేజీఎఫ్ ఛాప్టర్ 3 షూటింగ్ ఎప్పుడనేది చెప్పేశారు నిర్మాతలు. ఆ వివరాలు మీ కోసం..

భారతీయ చిత్ర పరిశ్రమలో బాహుబలి తరువాత అంతటి భారీ హిట్ కైవసం చేసుకున్న సినిమా కేజీఎఫ్. కేజీఎఫ్ మొదటి భాగాన్ని మించి ఆడింది కేజీఎఫ్ రెండవ భాగం. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళంలో విడుదలైన కేజీఎఫ్ సినిమా సృష్టించిన విజయం అంతా ఇంతా కాదు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ వసూళ్లను దాటేసింది కేజీఎఫ్ 2. కేజీఎఫ్ ఛాప్టర్ 2లో హీరో చివర్లో మరణించినట్టు చూపించినా..ఛాప్టర్ 3 ఉందని చెప్పడం ద్వారా ప్రేక్షకుల్లో హైప్స్ పెంచేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. 

ఇక అప్పట్నించి కేజీఎఫ్ ఛాప్టర్ 3 ఎప్పుడు ప్రారంభం కానుంది, అసలుందా లేదా అనే సందేహాలు ప్రారంభమయ్యాయి. అయితే చిత్ర నిర్మాతలు ఈ సందేహాల్ని పటాపంచలు చేశారు. కేజీఎఫ్ ఛాప్టర్ 3 కచ్చితంగా ఉంటుందని నిర్మాణ సంస్థ హోమెబుల్ తెలిపింది. ప్రస్తుతం దర్శకుడు ప్రశాత్ నీల్..ప్రభాస్‌తో సలార్ సినిమా, ఎన్టీఆర్‌తో మరో సినిమా చేయనున్నాడు. ఈ రెండూ పూర్తయిన తరువాత ఛాఫ్టర్ 3 తెరకెక్కనుందని హోమెబుల్ సంస్థ వెల్లడించింది. అంటే 2024 చివర్లో లేదగా 2025 ప్రారంభంలో ఈ సినిమా తెరకెక్కనుంది. 

Also read: NBK Vs Chiru: బాలయ్యను చిత్తు చేసిన చిరు.. ట్రైలర్ లెక్కలు చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News