NBK Vs Chiru: బాలయ్యను చిత్తు చేసిన చిరు.. ట్రైలర్ లెక్కలు చూశారా?

Waltair Verayya Vs Veera Simha Reddy Trailer Stats: బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాల ట్రైలర్ లెక్కల మీద ఒక లుక్కు వేద్దామా?  

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 8, 2023, 08:41 PM IST
NBK Vs Chiru: బాలయ్యను చిత్తు చేసిన చిరు.. ట్రైలర్ లెక్కలు చూశారా?

Waltair Verayya Vs Veera Simha Reddy 24 Hours Trailer Stats: నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలు సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన విడుదలవుతుండగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీ విడుదలవుతోంది.

ఇక ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు చాలా కాలం తర్వాత పోటీ పడుతూ ఉండడంతో అందరికీ ఈ సినిమాల మీద ఆసక్తి నెలకొంది. ప్రతి విషయం లోను ఈ రెండు సినిమాలను కంపేర్ చేస్తున్నారు. తాజాగా ఈ రెండు సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్ రిలీజ్ అవ్వగా 24 గంటల్లో ఏ సినిమా ట్రైలర్ ఎంత రెస్పాన్స్ ఎక్కించుకుంది అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే వాల్తేరు వీరయ్య సినిమా ట్రైలర్ వీర సింహారెడ్డి ట్రైలర్ కంటే ఎక్కువ రెస్పాన్స్ దక్కించుకోవడం గమనార్హం.

వాల్తేరు వీరయ్య సినిమా ట్రైలర్ 24 గంటల్లో 11.77 మిలియన్ వ్యూస్ దక్కించుకోగా 471.8 కె లైక్స్ దక్కించుకుంది. ఇక వీర సింహారెడ్డి ట్రైలర్ 8.01 మిలియన్ వ్యూస్ దక్కించుకోగా 382.6 కె లైక్స్ దక్కించుకుంది. అయితే ఓవర్సీస్ రిలీజ్ విషయంలో వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా కంటే కాస్త ముందు ఉంది అనే చెప్పాలి.  వీర సింహారెడ్డి వాల్తేరు వీరయ్య సినిమా కంటే ఎక్కువ లొకేషన్స్ దక్కించు కోవడంతో పాటు ఆ లొకేషన్స్ లో కూడా ఎక్కువ టికెట్లు వాల్తేరు వీరయ్య సినిమా కంటే వీరసింహారెడ్డి సినిమానే దక్కించుకోవడం గమనార్హం.

మెగా అభిమానులు తమ ట్రైలర్, టీజర్ రెస్పాన్స్ తో తమ హీరో పేరుట రికార్డులు నమోదు చేస్తుంటే బాలకృష్ణ అభిమానులు మాత్రం టికెట్లు కొనే పనిలో ఉన్నారు. నందమూరి బాలకృష్ణ సినిమాని అలాగే మెగాస్టార్ చిరంజీవి సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. బాలకృష్ణ సినిమా డిసెంబర్లోనే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ చివరికి సంక్రాంతికి రిలీజ్ అవుతుంది.
Also Read: Chahal Viral Video: సూర్య భాయ్ చేతికి చాహల్ ముద్దు.. వైరల్ వీడియో చూశారా?

Also Read: Fire accident: తెలంగాణాలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 
 

Trending News