The Ghost Trailer: అంచనాలు పెంచ్తేస్తున్న ది ఘోస్ట్ ట్రైలర్!

The Ghost - Theatrical Trailer Telugu Review: నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో రూపొందిన ది ఘోస్ట్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 25, 2022, 07:32 PM IST
The Ghost Trailer: అంచనాలు పెంచ్తేస్తున్న ది ఘోస్ట్ ట్రైలర్!

The Ghost - Theatrical Trailer Telugu Review: వైల్డ్ డాగ్, బంగార్రాజు సినిమాలతో వరుస హిట్లు అందుకున్న అక్కినేని నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటి గుల్ పనాగ్ నాగార్జున సోదరి పాత్రలో నటిస్తుండగా నాగార్జున మేనకోడలు పాత్రలో అనికా సురేంద్రన్ నటిస్తున్నారు. ఇక ఇతర కీలక పాత్రలలో మనీష్ చౌదరి, రవివర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, బిలాల్ హుస్సేన్ వంటి వారు నటిస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి అలాగే నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ల మీద ఈ సినిమాని సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తుండగా సోనాలి నారంగ్ సమర్పిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు స్వయంగా రచించి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ముఖేష్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. మార్క్ కే రాబిన్, భారత్ -సౌరబ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

అక్టోబర్ 5వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్స్ వేదికగా షేర్ చేసి సినిమా యూనిట్ కు అభినందనలు తెలిపారు. ఇక ఈ ట్రైలర్ గనుక పరిశీలిస్తే నిమిషం 53 సెకండ్ల పాటు సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం కూడా ఆకట్టుకునే విధంగా సాగింది. ఈ ట్రైలర్ ను బట్టి చూస్తే నాగార్జున విక్రమ్ అనే ఒక ఇంటర్పోల్ ఆఫీసర్ లో పాత్రలో నటిస్తున్నారు.

తన సోదరిని, మేనకోడలిని చంపడానికి మాఫియా రంగంలోకి దిగగా వారిని అంతమొందించేందుకు తన ప్రియురాలు సోనాల్ చౌహాన్ తో కలిసి నాగార్జున రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. అయితే మాఫియా నాగార్జున సోదరిని మేన కోడల్ని ఎందుకు టార్గెట్ చేసింది? వారిని నాగార్జున అడ్డుకోగలిగాడా లేదా? అనేది ఈ సినిమా కథ. ఇక ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమా ట్రైలర్ మీద మీరు కూడా ఒక లుక్కేయండి మరి.
Also Read: Prabhas- Maruthi FIlm Launched: రహస్యంగా ప్రారంభమైన మారుతి-ప్రభాస్ మూవీ?

Also Read: Anushka Shetty Marriage: అనుష్క పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరో తెలుసా! అస్సలు ఊహించరు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News