Krack remuneration controversy: క్రాక్ సినిమా నిర్మాతపై దర్శకుడి ఫిర్యాదు

Krack movie నిర్మాత ఠాగూర్ మధు మరోసారి చిక్కుల్లో పడ్డాడు. దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో మాస్ మహారాజ రవితేజ, శృతిహాసన్ జంటగా ఠాగూర్ మధు నిర్మించిన Krack movie విడుదల రోజే ఇబ్బందుల్లో పడిన సంగతి తెలుగు సినీ ప్రేక్షకులకు అందరికీ తెలిసిన విషయమే. అందుకు కారణం ఏంటో కూడా అందరికీ తెలిసిందే.

Last Updated : Feb 6, 2021, 01:27 PM IST
Krack remuneration controversy: క్రాక్ సినిమా నిర్మాతపై దర్శకుడి ఫిర్యాదు

Krack movie నిర్మాత ఠాగూర్ మధు మరోసారి చిక్కుల్లో పడ్డాడు. దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో మాస్ మహారాజ రవితేజ, శృతిహాసన్ జంటగా ఠాగూర్ మధు నిర్మించిన Krack movie విడుదల రోజే ఇబ్బందుల్లో పడిన సంగతి తెలుగు సినీ ప్రేక్షకులకు అందరికీ తెలిసిన విషయమే. అందుకు కారణం ఏంటో కూడా అందరికీ తెలిసిందే. మధు నుంచి ఎప్పటి నుంచో డబ్బులు రావాల్సి ఉన్న ఓ డిస్ట్రిబ్యూటర్.. తన డబ్బులు తనకు ఇచ్చే వరకు క్రాక్ విడుదల చేయకూడదని అడ్డుకోవడంతో రిలీజ్ డే నాడే క్రాక్ మూవీకి క్రాక్ వచ్చినంత పనయ్యింది. హీరో Ravi Teja కూడా ఇది ఒకింత ఇబ్బందికరమైన పరిణామంగా నిలిచింది. దీంతో నిర్మాత Tagore Madhu ఆగమేఘాల మీద ఆ రోజు ఆ వివాదాన్ని సద్దుమణిగేలా చేసుకున్న తర్వాతే Krack Movie విడుదలైంది.

క్రాక్ మూవీకి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన కనిపించింది. బిజినెస్ బాగుందనే టాక్ కూడా వినిపించింది. అయినప్పటికీ తనకు ఇప్పటివరకు Director remuneration ఇవ్వలేదని చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని వీధికెక్కాడు. ఇదే విషయంపై గోపీచంద్ మలినేని Directors association కి ఫిర్యాదు చేయగా.. ఆ ఫిర్యాదు కాపీని దర్శకుల సంఘం Producers council కి పంపించింది. అటు నిర్మాతల మండలి కూడా మధు వివరణ కోరుతూ అదే ఫిర్యాదును ఆయనకు పంపించినట్టు సమాచారం. 

Also read : Shruti Haasan remuneration: సలార్ మూవీ కోసం రేటు పెంచిన శృతి హాసన్

ఇంతటితో Gopichand Malineni's Remuneration వివాదం పరిష్కారం అవుతుందా లేక మరో టర్న్ తీసుకుంటుందా అని సినీవర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. సినీ పరిశ్రమ గురించి బాగా తెలిసిన మధు కూడా ఈ వివాదాన్ని పెద్దది చేసుకోడు అని సినీవర్గాలు భావిస్తున్నాయి. లేదంటే Krack movie కి ఎదురైన ఇబ్బందులు చూసి భవిష్యత్తులో పెద్ద దర్శకులు ఎవ్వరూ అతడితో కలిసే పని చేసేందుకు ముందుకు రారు అని ఇంకొంతమంది చెబుతున్నారు. ఇలాంటి వివాదాల్లో నిర్మాత మధు పేరు వినబడటం ఇదేం మొదటిసారి కాదు... గతంలో Arjun Suravaram movie సమయంలోనూ మధు ఇదే తరహా చిక్కులు ఎదుర్కొన్నాడని సినీ ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x