Krithi Shetty: చీరకట్టులో కవ్విస్తున్న బేబమ్మ.. చిన్నపిల్లను కాదంటోందే!

Krithi Shetty Saree Photos: తాజాగా కృతి శెట్టి  చీరకట్టులో మెరిసింది. చాలా సింపుల్ గా స్లీవ్ లెస్ చీరకట్టులో మెరుస్తూ నేనేమీ చిన్నపిల్లని కాదు అన్నట్లుగా కవ్విస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 16, 2022, 10:29 AM IST
Krithi Shetty: చీరకట్టులో కవ్విస్తున్న బేబమ్మ.. చిన్నపిల్లను కాదంటోందే!

Krithi Shetty Saree Photos: ఉప్పెన సినిమాతో టాలీవుడ్ తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి గురించి చేసిన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 18 ఏళ్ల ఈ భామ ఇప్పటికే సూపర్ స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కించుకుంది. కర్ణాటకలోని మంగళూరులో పుట్టి పెరిగిన ఈ భామ తన తల్లిదండ్రుల వ్యాపార నిమిత్తం ముంబైలోనే సెటిల్ అయింది.  తొలుత ఉప్పెన కంటే ముందే హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన సూపర్ థర్టీ అనే సినిమాలో ఒక స్టూడెంట్ పాత్రలో మెరిసింది.

ఆ తర్వాత ఉప్పెన సినిమాలో బేబమ్మ అనే పాత్రతో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ఇక ఆ తర్వాత ఆమెకు వరుస సినీ అవకాశాలు దక్కుతున్నాయి. శ్యాం సింగరాయ్ సినిమాలో నాని సరసన బంగార్రాజు సినిమాలో నాగచైతన్య సరసన నటించిన ఈ భామ తాజాగా రామ్ సరసన ది వారియర్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమాలో విజిల్ మహాలక్ష్మి అనే పాత్రలో ఆమె కనిపించగా ఆ పాత్రకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఆమె సుధీర్ బాబు హీరోగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో కూడా నటించింది.

ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే ఉంది. ఆ సినిమా త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇవి కాక నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఒక సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ కూడా ఇంకా ప్రారంభం కాలేదు. అయితే అసలు విషయం ఏమిటంటే తాజాగా ఈ భామ చీరకట్టులో మెరిసింది. చాలా సింపుల్ గా స్లీవ్ లెస్ చీరకట్టులో మెరుస్తూ నేనేమీ చిన్నపిల్లని కాదు అన్నట్లుగా కవ్విస్తోంది. ఇక ఆమె తన ఫోటోలు షేర్ చేసిన వెంటనే అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం టాలీవుడ్ సహా కోలీవుడ్ లో ఉన్న క్రేజియస్ట్ హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయిన కృతి శెట్టి అందాలను మీరు కూడా చూసేయండి మరి.

 
 
 
 
 

Also Read: Adah Sharma: ఆకులే అడ్డంగా ఆదా శర్మ రచ్చ.. డ్రెస్ ఇలా కూడా ఉంటుందా?

Also Read: Sushmita Sen Net Worth: లలిత్‌ మోదీతో సుష్మితా సేన్‌ డేటింగ్.. మాజీ విశ్వసుందరి ఆస్తుల విలువెంతో తెలుసా?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News