Lavanya Tripathi Birthday: జనం మదిలో ఇప్పటికీ 'అందాల రాక్షసి'గానే.. లావణ్య త్రిపాఠి రేర్ పిక్స్!

Tollywood Actress Lavanya Tripathi birthday special Images. నేడు లావణ్య త్రిపాఠి బర్త్ డే. ఈరోజుతో అందాల లావణ్య 32వ పడిలోకి అడుగుపెట్టారు. బర్త్ డే సందర్భంగా సొట్టబుగ్గల సుందరి రేర్ పిక్స్ ఓసారి చూద్దాం.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 15, 2022, 03:39 PM IST
  • జనం మదిలో ఇప్పటికీ 'అందాల రాక్షసి'గానే
  • లావణ్య త్రిపాఠి రేర్ పిక్స్
  • 32వ పడిలోకి సొట్టబుగ్గల సుందరి
Lavanya Tripathi Birthday: జనం మదిలో ఇప్పటికీ 'అందాల రాక్షసి'గానే.. లావణ్య త్రిపాఠి రేర్ పిక్స్!

Tollywood Actress Lavanya Tripathi birthday special pictures: 1990 డిసెంబరు 15న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో లావణ్య త్రిపాఠి జన్మించారు. మోడలింగ్​తో కెరీర్​ ప్రారంభించి పలు వాణిజ్య ప్రకటనలు, టెలివిజన్‌ షోలలో ఆమె నటించారు.  

2012లో హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన 'అందాల రాక్షసి' సినిమాతో లావణ్య త్రిపాఠి తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. డెబ్యూ మూవీతోనే అందం, నటనతో అదరగొట్టేశారు. 

మొదటి సినిమానే హిట్ కావడంతో సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠికి తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

అందాల రాక్షసి, దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, శ్రీరస్తు శుభమస్తు, యుద్ధం శరణం, ఉన్నది ఒకటే జిందగీ, అంతరిక్షం, సోగ్గాడే చిన్ని నాయనా, అర్జున్ సురవరం, ఏ1 ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా చిత్రాలతో లావణ్య త్రిపాఠి నటించారు. 

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే లావణ్య త్రిపాఠి.. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్‌ చేస్తూ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. ఆమె పెట్టే ఫొటోలకు లైకుల వర్షం కురుస్తుంటుంది. 

నేడు లావణ్య త్రిపాఠి బర్త్ డే. ఈరోజుతో అందాల లావణ్య 32వ పడిలోకి అడుగుపెట్టారు. బర్త్ డే సందర్భంగా సొట్టబుగ్గల సుందరి రేర్ పిక్స్ ఓసారి చూద్దాం. 

Also Read: Sunil Narine Captain: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కీలక నిర్ణయం.. కెప్టెన్‌గా సునీల్ నరైన్!  

Also Read: Best Water Geyser: కేవలం రూ. 1098కే గీజర్‌.. మంచుకురిసే చలికాలంలో కూడా ఫాస్ట్‌గా వేడి నీటిని ఇస్తుంది!   

లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News