ఆమె గురించి డైలాగ్ చెబితే చంపేస్తాం: బాలీవుడ్ హీరోయిన్‌కి బెదిరింపులు

బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెలాకి రోజు రోజుకీ పలు హిందూ సంఘాల నుండి వస్తున్న బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. 

Last Updated : Mar 4, 2018, 06:03 PM IST
ఆమె గురించి డైలాగ్ చెబితే చంపేస్తాం: బాలీవుడ్ హీరోయిన్‌కి బెదిరింపులు

బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెలాకి రోజు రోజుకీ పలు హిందూ సంఘాల నుండి వస్తున్న బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. హేట్‌ స్టోరీ చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలో బాగా పాపులరైన ఊర్వశి తాజాగా అదే చిత్రానికి నాలుగో సీక్వెల్‌గా వస్తున్న ‘హేట్‌ స్టోరీ 4’లో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె తన పాత్రను మహాభారతంలో ద్రౌపదితో పోల్చుకుంటూ పలు సంభాషణలు చెప్పనున్నట్లు సమాచారం.

అయితే ఆ డైలాగ్స్ హిందు పురాణ పాత్రైన ద్రౌపదిని కించపరిచేలా ఉన్నట్లు తమకు అనిపిస్తుందని.. వాటిని సినిమా నుండి తొలిగించకపోతే తమ నుండి ఊర్వశికి ప్రాణహాని తప్పదని పలువురు ఫోన్ చేసి కథానాయికను బెదిరించడంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. ‘హేట్‌ స్టోరీ 4’ మార్చి 9వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాల్ పాండ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

 

Trending News