Kalki 2898 AD: కల్కి లో క్యామియో పాత్రలు చేస్తున్నది వీళ్ళే.. స్టార్ డైరెక్టర్ సైతం!

Kalki 2898 AD Cast: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్.. దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కల్కి సినిమాలో.. చాలామంది స్టార్ నటీనటులు కామియో పాత్రలలో.. కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అన్ని భాషల కి సంబంధించిన.. స్టార్లు ఈ సినిమాలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాలో క్యామియో రోల్స్ కి సంబంధించిన లిస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 22, 2024, 02:25 PM IST
Kalki 2898 AD: కల్కి లో క్యామియో పాత్రలు చేస్తున్నది వీళ్ళే.. స్టార్ డైరెక్టర్ సైతం!

Kalki Cameo Roles: ప్రభాస్ కల్కి సినిమాలో.. అన్ని భాషల నుంచి స్టార్ నటీనటులు..కనిపించబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే.. ఈ సినిమాలో.. హీరోయిన్ గా నటిస్తుంది. మెయిన్ విలన్ గా.. లోకనాయకుడు కమల్ హాసన్.. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ బచ్చన్..ప్రేక్షకులను అలరించనున్నారు. చాలా రోజుల తర్వాత హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా.. ఈ సినిమాలో.. ప్రేక్షకులకు కనిపించనున్నారు. 

కాగా మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో.. కనిపించబోతున్నారట. సీతారామం సినిమాలో దుల్కర్ సల్మాన్ కి జంటగా నటించి.. తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేసిన.. మృణాల్ ఠాకూర్ కూడా ..ఈ సినిమాలో క్యామియో పాత్రలో కనిపించనుంది. 

ఇక యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కనిపించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఎలాంటి పాత్రలో అని క్లారిటీ ఇంకా లేదు. హాట్ బ్యూటీ మాళవిక నాయర్ కూడా ఈ సినిమాలో కనిపించనుంది. ఈమె పాత్రకి… సంబంధించిన ఫోటోలు ఈ మధ్యనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

కాగా ఒకప్పుడు హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ను అందుకున్న శోభన.. గత కొంతకాలంగా సినిమాలకి దూరం అయ్యారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత శోభన.. ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమాలో మంచి పాత్రలో కనిపించనున్నారు. ఇక టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అయిన ఎస్ఎస్ రాజమౌళి.. వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఈ సినిమాలో ఆసక్తికరమైన పాత్రలు.. పోషిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అది నిజం అయితే.. వారిని తెరపై చూడటం ప్రేక్షకులకు భలేగా ఉంటుంది అన్నడంలో సందేహం లేదు. 

అన్నా బెన్, శాశ్వత చటర్జీ లు కూడా ఈ సినిమాలో మంచి పాత్రలు పోషించారట. ఇక సినిమాలో రోబోటిక్ కార్ అయిన బుజ్జి పాత్రకి… కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆమె వాయిస్ కూడా సినిమా మీద అంచనాలు పెరగడానికి ఒక కారణమే. మరి ఇన్ని.. క్యామియోలు ఉన్న ఈ సినిమా.. ఎలాంటి విజయం సాధిస్తుందో అని ప్రేక్షకులు.. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Read more: Viral News in Telugu: కొంపముంచిన రీల్.. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిన కారు.. షాకింగ్ వీడియో

Read more: Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News