M.S. Rajashekhar Reddy: కులాల కుంపటి.. సొంత సినిమా ఈవెంట్ కే రాలేని పరిస్థితుల్లో నితిన్ డైరెక్టర్!

M.S. Rajashekhar Reddy Skips Trailer Release event: తాజాగా గుంటూరు బ్రాడీపేటలోని ఒక పబ్లిక్ ఈవెంట్ లో సినిమా ట్రైలర్ లాంచ్ జరిగింది. కెప్టెన్ ఆఫ్ ది షిప్ గా భావించే రాజశేఖర్ రెడ్డి మాత్రం ఈవెంట్ కు హాజరు కాలేదు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 31, 2022, 12:15 PM IST
M.S. Rajashekhar Reddy: కులాల కుంపటి.. సొంత సినిమా ఈవెంట్ కే రాలేని పరిస్థితుల్లో నితిన్ డైరెక్టర్!

M.S. Rajashekhar Reddy Skips Trailer Release event: కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేం అంటూ ఉంటారు పెద్దలు. ఇప్పుడు అదే సామెత నితిన్ హీరోగా రూపొందిన మాచర్ల నియోజకవర్గం దర్శకుడికి సరిగా వర్తిస్తుంది. అసలు విషయం ఏమిటంటే సుమారు 50 కి పైగా సినిమాలకు ఎడిటర్ గా వ్యవహరించి ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు ఎడిటర్ రాజశేఖర్ రెడ్డి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఆయన కమ్మ అలాగే కాపు  కులాలను కించపరిచే విధంగా ఒక ట్వీట్ చేశారనే ప్రచారం జరిగింది. ఆ ట్వీట్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వెంటనే ఆయన తెరకెక్కించిన మాచర్ల నియోజకవర్గం సినిమా బ్యాన్ చేయాలి అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారం రేగింది. దీంతో అది తాను పెట్టిన ట్వీట్ కాదని ఫేక్ ట్వీట్ అని ఆయన కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.

అది నిజంగా ఫేక్ ట్వీటో లేక ఆయన నిజగానే పెట్టిన ట్వీటో తెలియదు కానీ నితిన్ కూడా అది ఫేక్ ట్విట్ అని తమ సినిమాను ఇబ్బంది పెట్టడానికి ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. తర్వాత వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్లిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. సినిమా మీద కావాలని దుష్ప్రచారం చేస్తూ ఫేక్ ట్వీట్లు సర్క్యులేట్ చేస్తున్నారని వారి మీద చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదంతా బాగానే ఉంది కానీ తాజాగా గుంటూరు బ్రాడీపేటలోని ఒక పబ్లిక్ ఈవెంట్ లో సినిమా ట్రైలర్ లాంచ్ జరిగింది.

హీరో నితిన్ జానీ మాస్టర్ తో కలిసి సందడి చేశారు. అలాగే అనిల్ రావిపూడి ముఖ్యఅతిథిగా ఈవెంట్ గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. అయితే సినిమా మొత్తానికి కెప్టెన్ ఆఫ్ ది షిప్ గా భావించే రాజశేఖర్ రెడ్డి మాత్రం ఈవెంట్ కు హాజరు కాలేదు. అయితే ఆయన ఏదో పనిలో ఉన్నారు అనుకుంటే పొరపాటే ఎందుకేంటి సినిమా విడుదలైన తర్వాత ట్రైలర్ కు వచ్చిన అద్భుతమైన అన్ని ట్వీట్లకి ఆయన ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూనే ఉన్నాడు.

అయితే కులాల కామెంట్స్ నేపథ్యంలో ఆయన వస్తే అనవసరమైన వివాదం మళ్లీ మొదలవుతుంది అనే ఉద్దేశంతోనే ఆయనను ఈవెంట్ కు దూరంగా పెట్టారనే వాదన వినిపిస్తోంది. ఇక నష్ట నివారణ చర్యలలో భాగంగా ఆయన ఏ కులాన్ని అయితే దూషించాడు అని ప్రచారం జరుగుతుందో అదే సామాజిక వర్గానికి సంబంధించిన అనిల్ రావిపూడిని ముఖ్యఅతిథిగా పిలిచి కొంత ఈ విషయాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ వ్యవహారం మాత్రం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Read Also: Nookaraju: క్యాష్ షోలో షాకింగ్ ఘటన.. చేతిలో కర్పూరం హారతి… తాళి కట్టేందుకు విఫలయత్నం!

Read Also: Jabardasth: జబర్దస్త్ లో కొత్త యాంకర్ ఎంట్రీ.. ఆ హాట్ భామకే అవకాశం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News