Mad OTT: 'మ్యాడ్' డిజటల్ రైట్స్ ను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Mad Movie: యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్'కు ఆడియెన్స్ నుంచి ఊహించని స్పందన వస్తోంది. రిలీజైన అన్ని చోట్లా ఈ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ పార్టనర్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 8, 2023, 02:27 PM IST
Mad OTT: 'మ్యాడ్' డిజటల్ రైట్స్ ను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

MAD Movie OTT Release date: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్ లో నటించిన మూవీ మ్యాడ్. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ద్వారా కల్యాణ్ శంకర్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. సూర్యదేవర నాగ వంశ సమర్పించిన ఈ చిత్రాన్ని ఆయన కుమార్తె హారిక ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి నిర్మించారు. అక్టోబరు 06న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌ కుమార్, గోపికా ఉద్యాన్ హీరోయిన్లుగా నటించారు. అంతేకాకుండా ఇందులో రఘుబాబు, రచ్చరివి, మురళీధర్ గౌడ్ ఇతర పాత్రల్లో నటించారు. సినిమా విడుదలైననప్పటి నుంచి ఈ మూవీ పాజిటివ్ టాక్ దూసుకుపోతుంది. అంతేకాకుండా ఈ చిత్రానికి కలెక్షన్స్ కూడా బాగానే వస్తాయి. 

కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీకి అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తోంది. భీమ్స్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అని చెప్పాలి. హ్యాపీ డేస్, జాతిరత్నాలను మిక్స్ చేసి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉందని ఆడియెన్స్ అంటున్నారు. దీంతో ఈ మూవీ ఓటీటీ హక్కులకు డిమాండ్ బాగానే పెరిగింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ మంచి ధరకు సొంతం చేసుకుందని సమాచారం. అంతేకాకుండా ఈ మూవీ రిలీజైన నాలుగు వారాల్లో ఓటీటీ ఎంట్రీ ఇచ్చేలా మేకర్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ మూవీ నవంబరు మెుదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్ రిలీజ్ చేసిన ట్రైలర్ కు మంచి ఆదరణ లభించడంతో ముఖ్యంగా యూత్ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు.  మ్యాడ్ మూవీ విజయం సాధించడంతో సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు మేకర్స్.  ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నందుకు ఆడియెన్స్ కు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు.

Also Read: Raa Raja Movie: భయపెట్టేందుకు రెడీ అవుతున్న 'రా..రాజా'.. డిఫరెంట్‌గా ఫస్ట్ లుక్ పోస్టర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

 

Trending News