Mahesh Babu, Venkatesh multistarrer: మహేష్ బాబు, వెంకీ కాంబోలో మరో మల్టీస్టారర్ ?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా చిత్రం ( Khaleja movie ) విడుదలై 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటీవల మహేష్ బాబు ( Mahesh Babu ) తన ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో ఖలేజా మేకింగ్ షాట్స్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఖలేజా సినిమాను డైరెక్ట్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ( Trivikram Srinivas ) మరోసారి నటించబోతున్నానని పరోక్షంగా తెలిపాడు.

Last Updated : Oct 9, 2020, 09:32 PM IST

తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వెంకటేష్ దగ్గుబాటి ( Venkatesh ), మహేష్ బాబు కలిసి మల్టీస్టారర్ కోసం సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే కానీ నిజమైతే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ( Seetamma vakitlo sirimalle chettu ) తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ మరోసారి ఈ మల్టీస్టారర్‌ కోసం జతకట్టనున్నారన్న మాట. గతంలో శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో మహేష్, వెంకటేష్ ఎంత బాగా అభిమానులను ఆకట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అన్నాదమ్ముళ్లుగా చిన్నోడు, పెద్దోడు పాత్రల్లో ఆ ఇద్దరి నటన అదుర్స్ అనిపించింది. Also read : Pelli Sandadi: రాఘవేంద్రరావు మరో ‘పెళ్లి సందడి’ మొదలైంది

ఈ ఇద్దరు హీరోల బలాలు, ప్రేక్షకుల నాడీ తెలిసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సాధ్యమైనంత ఉత్తమమైన కథతో ఈ సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తారని తెలుస్తోంది. ఈ మల్టీస్టారర్ చిత్రం కోసం స్క్రిప్ట్ పని పూర్తయినట్లు సమాచారం. కానీ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్, జూనియర్ ఎన్టీఆర్ ( Jr Ntr ) నటించబోయే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే ( Actress Pooja Hegde ) కోసం చర్చలు జరుగుతున్నాయి.

వెంకటేష్ తన తరువాతి యాక్షన్ డ్రామా చిత్రం అయిన నారప్ప సినిమా షూటింగ్ ( Narappa movie shooting ) తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నాడు. తమిళ బ్లాక్ బస్టర్ చిత్రం 'అసురన్' చిత్రం రీమేకే ( Asuran telugu remake ) ఈ నారప్ప చిత్రం. అలాగే మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాతో ( Sarkaru vaari paata ) బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా ( Actress Keerty Suresh ) నటిస్తోంది. Also read : Laxmmi Bomb Trailer: లక్ష్మణ్-లక్ష్మీ పాత్రల్లో అదరగొట్టిన అక్షయ్ కుమార్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News