Sitara Dance Video: సారంగ దరియా పాటకు దుమ్ము లేపే డాన్స్ చేసిన సితార..

Sitara Dance Video got Viral: టాలీవుడ్‌లో సూపర్‌స్టార్ మహేశ్ బాబు క్రేజే వేరు. ఇప్పుడతని కూతురు తండ్రికి తగ్గ తనయగా మారుతోంది. చిన్నప్పట్నించే చిన్న చిన్న డ్యాన్స్ వీడియోలతో సత్తా చాటుతోంది. ఇప్పుడు మరో పాటకు వేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 17, 2023, 05:15 PM IST
Sitara Dance Video: సారంగ దరియా పాటకు దుమ్ము లేపే డాన్స్ చేసిన సితార..

Sitara Dance Video got Viral: తెలుగు సినీ పరిశ్రమలో మహేశ్ బాబు కూతురు సితారకు మంచి క్రేజ్ ఉంది. సినిమాల్లోకి రాకపోయినా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లు పది లక్షలు దాటేశారు. యూట్యూబ్ ఇంటర్వ్యూలు, చిన్న చిన్న డ్యాన్స్ వీడియోలతో బాగా పాపులర్ అయిపోయింది సితార. ఇప్పుడు కొత్తగా సారంగ దరియా పాటకు డ్యాన్స్‌తో దుమ్ము దులిపేసింది.

మహేశ్ బాబు తనయ సితార తండ్రి సినిమాలతో పాటు ఇతర సినిమా పాటలకు స్టెప్పులేస్తూ వీడియోలు ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేస్తుంటోంది. సర్కారువారి పాట డ్యాన్స్‌లకు గతంలో సితార వేసిన డ్యాన్స్ బాగా హిట్టయింది. ఇన్‌స్టాలో అందుకే సితారకు అప్పుడే 10 లక్షల మంది ఫాలోవర్లు సిద్ధమైపోయారు. ఇన్‌స్టాలో సితార పోస్ట్ చేయడం ఆలస్యం పెద్దఎత్తున లైక్స్, కామెంట్లు వచ్చిపడుతున్నాయి. ఇప్పుడు మరో హిట్ సాంగ్‌కు సితార వేసిన డ్యాన్స్ దుమ్ము రేపుతోంది. వీడియో తెగ వైరల్ అవుతోంది

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by sitara 🍓 (@sitaraghattamaneni)

 

సారంగ దరియా పాటకు సితార డ్యాన్స్‌తో దుమ్ము రేపేసింది. లంగా ఓణీ దుస్తులు ధరించి చక్కని అభినయంతో వేసిన ఒక్కొక్క స్టెప్పు అందర్నీ ఆకర్షిస్తోంది. సితార క్యూట్ ప్రదర్శనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సారంగ దరియా పాట పోస్ట్ చేసిన గంట వ్యవధిలోనే లక్షమంది లైక్ కొట్టారంటే ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. జానపద పాటకు అచ్చంగా సాయి పల్లవి చేసినట్టుగా డ్యాన్స్ వేయడం సితారకే చెల్లింది. 

సితార భవిష్యత్తులో హీరోయిన్ అవుతుందో లేదో తెలియదు గానీ ఆ లక్షణాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయంటున్నారు నెటిజన్లు. గతంలో సర్కారువారి పాట పెన్నె సాంగ్ ప్రోమోలో సితార హల్‌చల్ చేసిన సంగతి మర్చిపోలేం. సితార ఈ వయస్సులోనే బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన సంగతి చాలామందికి తెలియదు. ప్రముఖ జ్యువెల్లరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఇటీవలే సైన్ చేసింది. ఈ తరహా కాంట్రాక్ట్ సైన్ చేసిన మొదటి ఇండియన్ స్టార్ కిడ్ ఈమెనే. 

Also Read: Adipurush Preview: ఆదిపురుష్ మూవీని థియేటర్లలోనే ఎందుకు చూడాలంటే.

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News