SSMB29: రాజమౌళిని చూసి హర్ట్ అవుతున్న మహేష్ అభిమానులు.. కారణం అదే!

Mahesh Babu- Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోతున్న సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఉన్నాయి. కానీ ఈ చిత్రం షూటింగ్ ఇంకా మొదలు పెట్టకపోవడంతో అభిమానులు తెగ నిరాశకు గురవుతున్నారు..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 13, 2024, 10:21 AM IST
SSMB29: రాజమౌళిని చూసి హర్ట్ అవుతున్న మహేష్ అభిమానులు.. కారణం అదే!

SSMB29 Update: బాహుబలి చిత్రం దగ్గర నుంచి రాజమౌళి క్రేజ్ దేశాలు దాటి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పెద్ద స్థాయికి చేరింది. ఈ క్రమంలో ఈ దర్శకుడు ఏమి చేసినా అది సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగానే వైరల్ ఈమధ్య రాజమౌళి డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. రాజమౌళి భార్య రమా రాజమౌళితో ఈ దర్శకుడు వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఆ డాన్స్ వీడియోలను ప్రేక్షకులు మరిచిపోక ముందే రాజమౌళి ఒక యాడ్ లో కూడా కనిపించారు. ఇప్పుడు ఈ అడ్వటైజ్మెంట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజమౌళి, డేవిడ్ వార్నర్ ఒక యాడ్ లో కనిపించి మెప్పించారు. 

ఈ క్రమంలో మహేష్ బాబు అభిమానులు మాత్రం రాజమౌళిని చూసి తెగ హర్ట్ అవుతున్నారు. అందుకు ప్రధాన కారణం రాజమౌళి ఇలా ఎంజాయ్ చేస్తూ తమకు సినిమా గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడం. దీంతో రాజమౌళి డాన్స్ వీడియోలు యాడ్ వీడియో కింద మహేష్ బాబు అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు.

అసలు మహేష్ బాబుతో సినిమా ఉందా లేదా? అసలు మహేష్ సినిమా వర్క్ జరుగుతుందా? ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు? మహేష్ బాబు పరిస్థితి ఏమిటి.. సినిమా లేదని ప్రాంక్ చేయరుగా? అసలు ఎందుకు మా మహేష్ బాబు అభిమానుల మనోభావాలతో ఆడుకోకండి అంటూ సరదాగా సోషల్ మీడియాలో మీమ్స్ కూర వేస్తున్నాడు. ఇప్పటికైనా మహేష్ సినిమా నుంచి దయచేసి ఏదో ఒక అప్డేట్ ఇవ్వండి అని అభిమానులు పెద్ద ఎత్తున రాజమౌళికి రిక్వెస్ట్ లు పెడుతున్నాడు. రాజమౌళి ఎంజాయ్ చేస్తుంటే మహేష్ సినిమా ఇంకా లేట్ అయిపోతుందని అభిమానులు బాధపడుతున్నారు. మొత్తానికి ఈ మెసేజెస్ చూసాను రాజమౌళి స్పందిస్తారో లేదో వేచి చూడాలి.

Also Read: Student Warn To Teacher: 'సార్‌ మార్కులు వేయకుంటే చేతబడి చేయిస్తా'.. జవాబుపత్రంలో విద్యార్థి వార్నింగ్‌

Also Read: BJP Candidate Viral Photo: ఎంపీ అభ్యర్థి అత్యుత్సాహం.. ప్రచారంలో యువతి బుగ్గపై ముద్దు

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News