Mahesh Babu - Guntur Kaaram TRP Rating: మహేష్ బాబుకు షాక్ ఇచ్చిన 'గుంటూరు కారం' టీఆర్పీ రేటింగ్.. సూపర్ స్టార్ రేంజ్‌కు ఇది తక్కువే..

Mahesh Babu - Guntur Kaaram TRP Rating: మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం 'గుంటూరు కారం'. సంక్రాంతి సీజన్‌లో విడుదలైన ఈ చిత్రం అనుకున్నంత రేంజ్‌లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా టీవీలో తొలిసారి టెలికాస్ట్ అయింది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 19, 2024, 09:55 AM IST
Mahesh Babu - Guntur Kaaram TRP Rating: మహేష్ బాబుకు షాక్ ఇచ్చిన 'గుంటూరు కారం' టీఆర్పీ రేటింగ్.. సూపర్ స్టార్ రేంజ్‌కు ఇది తక్కువే..

Mahesh Babu - Guntur Kaaram TRP Rating: టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేషన్‌లో వచ్చిన భారీ చిత్రం 'గుంటూరు కారం'. ఈ చిత్రం పొంగల్ పోటీలో విడుదలై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు మహేష్ బాబు ఇమేజ్‌తో ఈ సినిమా డీసెంట్ వసూళ్లనే రాబట్టింది.  థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా  ప్రస్తుతం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా  తాజాగా ఈ సినిమా జెమిని టీవీలో వరల్డ్ టెలివిజన్‌ ప్రీమియర్‌గా ఉగాది కానుకగా ఈ సినిమా ప్రసారమైంది. అయితే ఈ సినిమాకు తొలిసారి 9.23 రేటింగ్ వచ్చింది. మహేష్ బాబు గత చిత్రం 'సర్కారు వారి పాట' సినిమాకు మాత్రం 9.45 రేటింగ్ వచ్చింది. మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో కాస్త డిజాప్పాయింట్‌లో ఉన్నారు.

అయితే ఈ మధ్య చాలా మంది ప్రేక్షకులు సినిమాలు అయితే థియేటర్స్‌లో చూస్తున్నారు. లేకపోతే.. ఓటీటీ వేదికగా చూసేస్తున్నారు. పైగా ఓటీటీలో మన కోరుకున్న టైమ్‌లో మనం ఇష్టమొచ్చినట్టు చూడొచ్చు. అది టీవీలో అయితే.. వాళ్లు చెప్పిన టైమ్‌కు యాడ్స్ గట్రా వుంటాయి. దీంతో మెజారిటీ ప్రేక్షకులు బడా సినిమాలను ముందుగా ఓటీటీ వేదికగా వీక్షిస్తున్నారు. ఏదో కొంత మంది మాత్రమే టీవీల్లో వస్తే చూడాలనుకునే ప్రేక్షకులున్నారు. ఏది ఏమైనా ఓటీటీ వంటి వేదికలు వచ్చిన తర్వాత సినిమాలకు ఈ రేంజ్ టీఆర్పీ రావడం అంటే మాములు విషయం కాదనే చెప్పాలి.

గుంటూరు కారం మూవీ డివైడ్ టాక్‌తో దాదాపు బాక్సాఫీస్ దగ్గర 90 శాతం రికవరీ సాధించింది. ఇక మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో సూపర్ క్రేజ్ ఉంది. వీళ్లిద్దరి కలయికలో  అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. అందులో అతడు మూవీ క్లాసిక్‌గా నిలిస్తే.. ఖలేజా మూవీ బిగ్ స్క్రీన్ పై కాకుండా చిన్న తెరపై సూపర్ హిట్టైయింది. ఆ తర్వాత వీళ్ల కాంబోలో వచ్చిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సీజన్‌తో పాటు మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల స్టార్ ఇమేజ్ తోడు కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది.  
గుంటూరు కారం సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ క్లోజింగ్ కలెక్షన్స్  విషయానికొస్తే..ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా  రూ. 111 కోట్ల షేర్.. (రూ. 184.5 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. గుంటూరు కారం  సినిమా థియేట్రికల్‌గా  రూ. 132 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్డర రూ.21.19 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. ఏది ఏమైనా నెగిటివ్ టాక్‌తో గుంటూరు కారం సినిమా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు.

Read More: Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News