Mahesh Babu's next with Anil Ravipudi: అనిల్ రావిపూడితో మహేష్ బాబు మరో సినిమా

Mahesh Babu's next with Anil Ravipudi: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఓకే చెప్పాడు. అదేంటి దర్శకదిగ్గజం ఎస్ఎస్ రాజమౌళికి కదా మహేష్ బాబు ఓకె చెప్పాల్సింది అని మీకు సందేహం వస్తుందేమో!! ఎందుకంటే Mahesh Babu, SS Rajamouli combo లో ఓ సినిమా తెరకెక్కనున్నట్టు మనం చాలా రోజులుగా వింటున్నాం కనుక.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 9, 2021, 03:50 PM IST
  • మరోసారి డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఓకే చెప్పిన టాలీవుడ్ సూపర్ స్టార్ Mahesh Babu.
  • Mahesh Babu, SS Rajamouli సినిమా సంగతేంటి ?
  • F3 Movie shooting తో బిజీగా ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి.
Mahesh Babu's next with Anil Ravipudi: అనిల్ రావిపూడితో మహేష్ బాబు మరో సినిమా

Mahesh Babu's next with Anil Ravipudi: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఓకే చెప్పాడు. అదేంటి దర్శకదిగ్గజం ఎస్ఎస్ రాజమౌళికి కదా మహేష్ బాబు ఓకె చెప్పాల్సింది అని మీకు సందేహం వస్తుందేమో!! ఎందుకంటే Mahesh Babu, SS Rajamouli combo లో ఓ సినిమా తెరకెక్కనున్నట్టు మనం చాలా రోజులుగా వింటున్నాం కనుక. అయితే, ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న మహేష్ బాబు అది పూర్తి కాగానే ఫ్రీ అవుతున్నప్పటికీ, రాజమౌళి మాత్రం RRR movie ఫ్రీ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. 

ఇదిలావుంటే, మరోవైపు Sarkaaru vaari paata movie కంటే ముందుగా అనిల్ రావిపూడితో కలిసి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ప్రాజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేవలం ఐదున్నర నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మహేష్ బాబు కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. Sarileru Neekevvaru movie బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అనిల్ రావిపూడిలో ఉన్న సత్తా ఏంటో మహేష్ బాబుకి అర్థమవడమే కాకుండా.. అతి తక్కువ వ్యవధిలో సినిమాను పూర్తి చేసే దర్శకుడిగానూ అనిల్ రావిపూడి మంచి మార్కులే కొట్టేశాడు. అందుకే రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ పూర్తి చేసుకునేలోగా.. అనిల్ రావిపూడితో కలిసి మరో సినిమాను పూర్తి చేయొచ్చనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నాడట.

Also read : Mahesh Babu's new caravan: కొత్త క్యారావ్యాన్ కొన్న మహేష్ బాబు

Anil Ravipudi ప్రస్తుతం F3 Movie shooting తో బిజీగా ఉన్నాడు. అక్టోబర్‌లోగా ఈ సినిమా నుంచి ఫ్రీ అవనుండటంతో ఆ తర్వాత వెంటనే మరో సినిమాను పట్టాలెక్కించేలా మహేష్ బాబుకు మరో కథ చెప్పి ఆయన చేత ఓకే చెప్పించుకున్నాడట.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News