Mahesh Babu: సర్కారు వారి పాట అప్‌డేట్ వచ్చేసింది!

Mahesh Babu Sarkaru Vaari Paata Shoot: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్ల తర్వాత నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. గీత గోవిందం లాంటి సక్సెస్ తర్వాత దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తోన్న మూవీ ఇది. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ జత కట్టింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2021, 05:16 PM IST
  • మహేష్ బాబు వరుస హిట్ల తర్వాత నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’
  • గీత గోవిందం లాంటి సక్సెస్ తర్వాత దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తోన్న మూవీ
  • సంక్రాంతి తర్వాత రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుందని సమాచారం
Mahesh Babu: సర్కారు వారి పాట అప్‌డేట్ వచ్చేసింది!

Mahesh Babu Sarkaru Vaari Paata Shoot: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్ల తర్వాత నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. గీత గోవిందం లాంటి సక్సెస్ తర్వాత దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తోన్న మూవీ ఇది. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ జత కట్టింది. కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణాలతో సినిమాలు షూటింగ్స్ వాయిదా పడ్డాయి. తాజాగా సినిమా షూటింగ్స్ మొదలయ్యాయి. కొన్ని సినిమాలు సైతం థియేటర్లలో విడుదల అవుతున్నాయి.

సర్కారు వారి పాట త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. సంక్రాంతి తర్వాత రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుందని సమాచారం. ఈ నెల 25 నుంచి దుబాయ్‌లో ప్రారంభం కానుందని ఫిల్మ్ నగర్ టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్‌లో షూటింగ్ చేయాలని తొలుత ప్లాన్ చేశారు, కానీ కరోనా కారణంగా Sarkaru Vaari Paata షెడ్యూల్ మొత్తం వాయిదా వేసుకున్నారు. దుబాయ్‌లో షూటింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోందట మూవీ యూనిట్.

Also Read: Keerthy Suresh marriage: కీర్తి సురేష్‌ పెళ్లికి ఒత్తిడి

ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఓ స్పెషల్ సాంగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత రెగ్యూలర్ షూటింగ్ కోసం ‘సర్కారు వారి పాట’ మూవీ యూనిట్ దుబాయ్ బయలుదేరనుంది. మహేష్ బాబు కొత్త లుక్‌లో కనిపించనున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఆ మధ్య రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ కోసం వేసిన సెట్ ఏమైందా అని మహేష్ బాబు(Mahesh Babu) అభిమానులు ఆలోచిస్తున్నారు.

Also Read: Ala Vaikunthapurramuloo Reunion Bash: అల వైకుంఠపురములో రీయూనియన్ బాష్ అదుర్స్..

కాగా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే.. బ్యాంకు మేనేజర్ కొడుకు పాత్రను మహేష్ బాబు పోషిస్తున్నాడు. అయితే ఓ వ్యాపారవేత్త చేసిన మోసం కారణంగా తన తండ్రిపై పడ్డ అపవాదును చెరిపేసేందుకు మహేష్ బాబు ఏం చేయనున్నాడు అనేది సినిమా స్టోరీ అని ప్రచారం జరుగుతోంది.

Also Read: Ammavodi Status: జగనన్న అమ్మ ఒడి స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News