Sarkaru vaari paata: సర్కారువారిపాట అప్‌డేట్ ఎప్పుడు, సినిమా మరోసారి వాయిదానా

Sarkaru vaari paata: కరోనా మహమ్మారి ప్రభావం భారీ, అగ్రనటుల సినిమాలపై పడింది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అభిమానులు ఎదురుచూస్తున్న సర్కారువారిపాట మరోసారి వాయిదా పడనుంది. తాజా అప్‌డేట్ కూడా విడుదల కాలేదు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 15, 2022, 06:46 AM IST
Sarkaru vaari paata: సర్కారువారిపాట అప్‌డేట్ ఎప్పుడు, సినిమా మరోసారి వాయిదానా

Sarkaru vaari paata: కరోనా మహమ్మారి ప్రభావం భారీ, అగ్రనటుల సినిమాలపై పడింది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అభిమానులు ఎదురుచూస్తున్న సర్కారువారిపాట మరోసారి వాయిదా పడనుంది. తాజా అప్‌డేట్ కూడా విడుదల కాలేదు. 

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు(Mahesh Babu) అప్‌కమింగ్ సినిమా సర్కారువారిపాట. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేశ్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే కోవిడ్ మహమ్మారి ప్రభావం కొత్త ఏడాదిలో విడుదల కావల్సిన సినిమాలపై చాలావరకూ పడిందని చెప్పవచ్చు. వాస్తవానికి జనవరి 14న సంక్రాంతికి సందడి చేయాల్సిన ఈ సినిమా ఆర్ఆర్ఆర్ జనవరి 7వ తేదీన విడుదల కావల్సి ఉండటం, ఇతర కారణాలతో వాయిదా పడిది. ఏప్రిలా్ 1న విడుదలకు సిద్ధమైంది చిత్ర యూనిట్. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కాలేదు. ఆ తరువాత సర్కారువారిపాట నటీనటులు మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌లు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ హోం క్వారంటెన్‌లో ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా షూటింగ్ మిగిలుంది. ఈ నేపధ్యంలో ఏప్రిల్ 1న కూడా సర్కారువారిపాట (Sarkaru vaari paata)విడుదలయ్యే పరిస్థితి లేదని తెలుస్తోంది. అందుకే సినిమాకు సంబంధించ అప్‌డేట్ కూడా విడుదల కాలేదు. మరోవైపు చిత్రయూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసిన తాజా అప్‌డేట్ కూడా ఆసక్తిగా మారింది.

కరోనా మహమ్మారి, కొన్ని ఇతర అనివార్య కారణాల వల్ల సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ ఆలస్యమైందని..తదుపరి సమాచారం త్వరలోనే ఇస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సర్కారువారిపాటను ఆగస్టు 5న విడుదల చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Also read:Krithi Shetty photo shoot: సంక్రాంతి స్పెషల్​ ఫొటోలతో కుర్రకారు మది దోచేస్తున్న కృతి శెట్టి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News