SVP Movie On OTT: సర్కారు వారి పాట ముందుగానే ఓటీటీలో స్ట్రీమింగ్, అమెజాన్ ప్రైమ్ సన్నాహాలు

SVP Movie On OTT: సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా అనుకున్నదానికంటే ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ హక్కులు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ ఇప్పట్నించే సన్నాహాలు చేస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 28, 2022, 08:29 AM IST
SVP Movie On OTT: సర్కారు వారి పాట ముందుగానే ఓటీటీలో స్ట్రీమింగ్, అమెజాన్ ప్రైమ్ సన్నాహాలు

SVP Movie On OTT: సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా అనుకున్నదానికంటే ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ హక్కులు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ ఇప్పట్నించే సన్నాహాలు చేస్తోంది. 

మే 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సర్కారు వారి పాట సినిమా బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతోంది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. విడుదలైన 12 రోజుల్లోనే 2 వందల కోట్ల గ్రాస్ వసూళ్లు దాటేసింది. తొలిరోజే ఈ సినిమా 75 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. విడుదలైన 12 రోజులకే 2 వందల కోట్ల క్లబ్‌లో చేరింది. ఓ వైపు థియేటర్లలో కలెక్షన్లు భారీగా వస్తున్నా..ఓటీటీ విడుదల విషయంలో అప్‌డేట్ ఆసక్తి రేపుతోంది. 

ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకే దక్కించుకుంది. వాస్తవానికి పెద్ద బడ్జెట్ సినిమాలు థియేటర్ రన్‌టైమ్ అనంతరం నెల రోజుల తరువాతే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాయి. కానీ అమెజాన్ ప్రైమ్ మాత్రం అంతకంటే ముందే సర్కారు వారి పాట సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సినిమా మేకర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది. అంటే ఈ నెలాఖరున లేదా జూన్ 10 వతేదీన స్ట్రీమింగ్ కానుందని సమాచారం. వాస్తవానికి జూన్ 24న విడుదల కావల్సి ఉంది. 

అయితే ఈ విషయమై అటు అమెజాన్ ప్రైమ్ లేదా సినిమా నిర్మాతల నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో అధికారిక ప్రకటన విడుదల కాలేదు. పరశురామ్ దర్శకత్వం వహించిన సర్కారు వారి పాటలో మహేశ్ బాబు, కీర్తి సురేశ్ నటీనటులుగా ఉన్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు. 

Also read: F3 director Anil Ravipudi Fire on trollers : ట్రోలర్స్‌పై అనిల్ రావిపూడి ఫైర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News