Laal Singh Chaddha: టాలీవుడ్ స్టార్స్ తో లాల్ సింగ్ చద్దా ప్రివ్యూ.. ఏడ్చేసిన అమీర్ ఖాన్! వీడియో వైరల్

Aamir Khan cries at Laal Singh Chaddha preview: లాల్ సింగ్ చద్దా ఆగస్టు 11వ తేదీన విడుదల కావడానికి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఈ సినిమా ప్రివ్యూ వేసి చూపించారు అమీర్ ఖాన్.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 16, 2022, 02:49 PM IST
  • చిరంజీవి నివాసంలో లాల్ సింగ్ చడ్డా ప్రివ్యూ
  • ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకున్న ఆమీర్ ఖాన్
  • సోషల్ మీడియాలో వైరల్ గా వీడియో
Laal Singh Chaddha: టాలీవుడ్ స్టార్స్ తో లాల్ సింగ్ చద్దా ప్రివ్యూ.. ఏడ్చేసిన అమీర్ ఖాన్! వీడియో వైరల్

Megastar Chiranjeevi First Review on Laal Singh Chaddha: అమీర్ ఖాన్ హీరోగా నాగచైతన్య ప్రధాన పాత్రలో కరీనా కపూర్ హీరోయిన్ గా రూపొందిన తాజా చిత్రం లాల్ సింగ్ చద్దా. అమెరికన్ మూవీ ఫారెస్ట్ గంప్ కు ఇండియన్ రీమేక్ గా రూపొందిన ఈ సినిమా నిజానికి షూటింగ్ ఎప్పుడో జరుపుకుంది. ఈ షూటింగ్ సమయంలో నాగచైతన్య సమంత కలిసే ఉన్నారు. ఇప్పుడు వీరు విడిపోయి తొమ్మిది నెలలు కావస్తోంది. అయితే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా అనేక వాయిదాల తరువాత ఆగస్టు 11వ తేదీన విడుదల కావడానికి రంగం సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఈ సినిమా ప్రివ్యూ వేసి చూపించారు అమీర్ ఖాన్. ఈ ప్రివ్యూ కి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, నాగచైతన్య సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు సుకుమార్, రాజమౌళి కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించి గతంలోనే వార్తలు రాగా ఈ విషయానికి సంబంధించి తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వచ్చిన వారితో సినిమా గురించి చర్చించడం ఆ తర్వాత తన ఇంట్లో ప్రివ్యూ థియేటర్లో సినిమా వీక్షించడం వంటి విశేషాలను చూపించారు.

ఇక ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి సినిమా ఎలా ఉందో వర్ణిస్తూ అమీర్ ఖాన్ తో ముచ్చట్లు పెట్టిన సంగతి కూడా చూపించారు. సినిమా చూసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి అమీర్ ఖాన్ ను గట్టిగా హత్తుకోగా వెంటనే అమీర్ ఖాన్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకోవడం కనిపిస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సినిమా అద్భుతంగా ఉందని చెబుతూ అమీర్ ఖాన్ ను మెచ్చుకుంటూ ఆయన భుజాన శాలువాతో సత్కరించడం కూడా. ఇక ఈ వీడియో షేర్ చేస్తూ చిరంజీవి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కొన్నాళ్ల క్రితం అమీర్ ఖాన్ ను జపాన్ లోని క్యోటో విమానాశ్రయంలో కలిసి కొంచెం సేపు మాట్లాడడమే ఇప్పుడు తాను అతని కలల ప్రాజెక్టులో భాగమయ్యేలా చేసిందని చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాను తెలుగులో చిరంజీవి సమర్పణలో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక తమ నివాసంలో ప్రత్యేక ప్రివ్యూ వేసినందుకు అమీర్ ఖాన్‏కి  ధన్యవాదాలు చెప్పిన చిరంజీవి సినిమా చూసి తన ఫస్ట్ రివ్యూ కూడా ఇచ్చేశారు.

మీరు తీసిన సినిమా ఒక జెమ్ అని, ఒక అద్భుతమైన ఎమోషనల్ జర్నీ అని తన రివ్యూ ఇచ్చేశారు చిరంజీవి. సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత, మెగా స్టార్ చిరంజీవి ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయమని అమీర్ ఖాన్‌కి సూచించారు. దానికి 
అమీర్ ఖాన్ వెంటనే అంగీకరించి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలని చిరంజీవి గారిని అభ్యర్థించారు.

దానికి ఒప్పుకున్న మెగాస్టార్ చిరంజీవి లాలా సింగ్ చద్దా తెలుగు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ట్వీట్ చేశారు. ఇక తన కేరీర్లో  మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా ఓ సినిమా సమర్పిస్తున్నారు. ఇండియన్ మూవీస్ భాషా పరిమితులను ఎలా అధిగమిస్తోంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ అని అంటున్నారు.  ఇక ఈ సినిమాను అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు.

 
Read Also: Adah Sharma: ఆకులే అడ్డంగా ఆదా శర్మ రచ్చ.. డ్రెస్ ఇలా కూడా ఉంటుందా?

Read Also: Krithi Shetty: చీరకట్టులో కవ్విస్తున్న బేబమ్మ.. చిన్నపిల్లను కాదంటోందే!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌ స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News