Manchu Lakshmi : గెలికి మరీ తిట్టించుకుంటున్నట్టు అయిందిగా.. సన్నీ లియోన్ పేరు తీయడంతో మంచు లక్ష్మీపై ట్రోల్స్

Manchu Lakshmi Trolls మంచు లక్ష్మీ మీద సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ అందరికీ తెలిసిందే.  మంచు ఫ్యామిలీ మీద మామూలుగానే సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంటుంది. తాజాగా మంచు లక్ష్మీ వేసిన కామెంట్ వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 13, 2023, 12:25 AM IST
  • నెట్టింట్లో మంచు లక్ష్మీ సందడి
  • పార్టీ మీటింగ్ అంటూ నెట్టింట్లో ట్వీట్
  • సన్నీ లియోన్ మీద మంచు లక్ష్మీ కామెంట్
Manchu Lakshmi : గెలికి మరీ తిట్టించుకుంటున్నట్టు అయిందిగా.. సన్నీ లియోన్ పేరు తీయడంతో మంచు లక్ష్మీపై ట్రోల్స్

Manchu Lakshmi Trolls మంచు ఫ్యామిలీ మీద సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే మంచు ఫ్యామిలీ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. మంచు ఫ్యామిలీ విషయాలు, గొడవలు సోషల్ మీడియాలో ఎంతగా వివాదానికి దారి తీశాయో అందరికీ తెలిసిందే. మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య జరిగిన గొడవలు అందరికీ తెలిసిందే. దాన్ని కప్పి పుచ్చుకునేందుకు మంచు విష్ణు ఓ రియాల్టీ షో ప్లాన్ వేసిన సంగతి తెలిసిందే.

సారథి అనే వ్యక్తి వల్ల మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య గొడవలు జరిగాయని, అందుకే ఇలా గొడవలు పడ్డారని వార్తలు వచ్చాయి. ఈ గొడవల గురించి తనకేమీ తెలియదని, తెలుసుకున్న తరువాత మాట్లాడతాను అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది. ఇక అన్నదమ్ములన్నాక గొడవలు సహజమని మోహన్ బాబు చెప్పుకొచ్చాడు. అయితే ఇదంతా కూడా రియాల్టీ షో అని మంచు విష్ణు కలరింగ్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

 

అయితే తాజాగా మంచు లక్ష్మీ తాజాగా ఓ ట్వీట్ వేసింది. కేరళలో ఏర్పాటు చేసిన ఈ సభకు భారీ జనాభా హాజరైంది. అయితే సోషల్ మీడియాలో ఈ ఫోటో ఎక్కువ షేర్ అయింది. ఇది ఏ నాయకుడు పెట్టిన సభ అంటూ సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ అవుతూ వచ్చింది. అయితే ఇందులో మంచు లక్ష్మీ చేసిన కామెంట్ ఎక్కువగా వైరల్ అవుతోంది.

Also Read:  Samantha : సమంత ఆంటీ ఇంకా రెండు రోజులే ఉంది!.. సామ్ రిప్లై ఇదే

ఇది అసలే పొలిటికల్ పార్టీకి సంబంధించిన పోస్ట్ కావడంతో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇది ఏ పార్టీ నాయకుడు ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు సంబంధించిన ఫోటో అని సోషల్ మీడియాలో పోస్ట్ రాగా.. దానికి మంచు లక్ష్మీ స్పందించింది. సన్నీ లియోన్ పెట్టిన సభకు ఇంత మంది హాజరైనట్టుగా మంచు లక్ష్మీ పరోక్షంగా కౌంటర్లు వేసింది. అయితే మంచు లక్ష్మీ పేరు తీయడంతో ఓ వర్తానికి చెందిన వారంతా మంచు లక్ష్మీని ట్రోల్ చేస్తున్నారు. ఇవన్నీ నీకు అవసరమా? పొలిటికల్ సభ గురించి నీకు అవసరమా? అని జనాలు ట్రోల్ చేయసాగారు.

Also Read: Renu Desai : పవన్ కళ్యాణ్‌ ఎందుకు స్పందించడు?.. నిలదీసిన నెటిజన్.. రేణూ దేశాయ్ రిప్లై వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFaceboo

Trending News