Manchu Manoj: ఇక ఊరుకోను.. ఈరోజు సాయంత్రం అన్నీ చెబుతా, మీడియా ముందు కన్నీటి పర్యంతమైన మంచు మనోజ్‌..

Manchu Manoj Emotional Video: మంచువారింట రచ్చ రేగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మీడియా ముందు ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు అని కన్నీటి పర్యంతమయ్యారు. అంతేకాదు నాన్న తరఫున నేను మీడియా మిత్రులకు సారీ చెబుతున్నా అన్నారు. అనవసరమైన గొడవలకు నన్ను నాభార్య బిడ్డను కూడా లాగుతున్నారు అని ఎమోషనల్‌ అయ్యారు మనోజ్‌.

Written by - Renuka Godugu | Last Updated : Dec 11, 2024, 12:46 PM IST
Manchu Manoj: ఇక ఊరుకోను.. ఈరోజు సాయంత్రం అన్నీ చెబుతా, మీడియా ముందు కన్నీటి పర్యంతమైన మంచు మనోజ్‌..

Manchu Manoj Emotional Video: మంచు మోహన్‌బాబు, మనోజ్‌లు ఆస్తి విషయంలో గొడవపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మోహన్‌బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి ఆయనకు సడెన్‌గా బీపీ ఎక్కువైందని, తలకు గాయం అయిందని చెబుతున్నారు. మోహన్‌ బాబు నిన్న రాత్రి మీడియాపై దాడి చేయడంతో రిపోర్టర్‌కు గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో మీడియా కూడా తీవ్ర ఆందోళన చేస్తోంది. అయితే, తాజాగా మంచు విష్ణు మా నాన్న తరఫున నేను సారీ చెబుతున్న.. నాకోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. ఇలా జరగడం చాలా బాధాకరం. నేను ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అని నేటి ప్రెస్‌ మీట్‌లో వాపోయారు.  ఈ వివాదంలో నా భార్య, కూతురి పేరు కూడా లాగుతున్నారు. నాకు న్యాయం చేయాలి.. సమస్యకు పరిష్కారం చేయాలి అని బంధువు కాళ్లు కూడా పట్టుకుంటా అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ రోజు అన్ని విషయాలు చెప్పేస్తా అన్నారు.

ఇదిలా ఉండగా తాజాగా మంచు మోహన్‌ బాబు తీస్తున్న 'కన్నప్ప' సినిమా వంద కోట్ల బడ్జెట్‌తో తీస్తున్నారని, ఇందులో మంచు మనోజ్‌కు షేర్‌ ఇవ్వకపోవడంతోనే వివాదం రాజుకుందని కోడై కూస్తున్నారు. ఈ సినిమాలో మోహన్‌ బాబు, విష్ణు నటిస్తున్నారు. అంతేకాదు ప్రముఖ బాలివుడ్‌, టాలివుడ్‌ హీరోలు కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రారంభించినప్పటి నుంచే వీరికి చెడిందని అనుకుంటున్నారు.

ఇదీ చదవండి: దీపను చంపడానికి జోత్స్న మాస్టర్‌ ప్లాన్‌.. అయ్యయ్యో.. పాలు పంచుకుని కలిసి పడుకుందాం అంటున్న కార్తీక్..

వినయ్‌, మా అన్న విష్ణు నాన్నను ప్రభావితం చేస్తున్నారు. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదు. మా నాన్న, అన్న తరఫున క్షమాపణ చెబుతున్న, ఎప్పటికీ మీ తోడు ఉంటా. నా కోసం సపోర్ట్‌ చేయడానికి వచ్చిన మీపై దాడి చేయడం బాధకరం. ఎప్పుడు ఏ అవసరమున్న నేనుంటా మీకు. నేను ఏమి అడగలేదు.. నా భార్య కూడా వారింటి నుంచి ఏం తేలేదు, అడగలేదు.. నేను కూడా అడగలేదు అని మీడియాతో అన్నారు మనోజ్‌. ఆస్తి అడగలేదు. ఏడు నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు మా అంకుల్‌  విజయవాడలో ఉంటారు. మీ నాన్నగారు ఒక్కరే ఉన్నారు. మీ అన్నయ్య దుబాయికి షిప్ట్‌ అయ్యారు. నీభార్యకు ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది అన్నారు. అలా తిరిగి వచ్చాను. ఈరోజు నామీద ఆరోపణలు వేస్తున్నారు. ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడాం అని చెప్పా.. వాళ్లు అన్ని చేశారు. నేను వారికి సపోర్ట్‌గా నిలబడే సరికి నన్ను ఇలా చేస్తున్నారు. ఇన్నాళ్లు ఆగా ఇక ఆగను.. ప్రతీది చెప్పేస్తా.. మొన్న 100 కు ఎందుకు డయల్ చేశా? ఏం చెప్పా? మీరు వారిని అడగండి. ఇంట్లో పది బండ్లు ఉన్నాయి. కానీ, 108 అంబులెన్స్‌ వచ్చింది ఎందుకు అని కనుక్కోండి సార్‌. మా నాన్న దేవుడు.. ఇప్పుడు చూస్తుంది మా నాన్న కాదు. 

ఇదీ చదవండి:  రుద్రాణీ నోట్లో మట్టికొట్టిన పెద్దాయన.. కోర్టుకు ఈడుస్తానని రెచ్చిపోయిన ధాన్యలక్ష్మి..

నేను అబద్దాలు ఆడను. నా ఫ్రెండ్స్‌ను అడగండి. సొంతగా ఇక్కడి వరకు  వచ్చాను, ప్రతీది సాయంత్రం వచ్చి చెబుతాను అన్నాడు మనోజ్. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న దాంట్లో తప్పు ఏముంది?. అన్న కంపెనీల్లో పని చేశాను. ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని చేశాను. ఒకటే అడుగుతున్నా మీకు నిజం తెలియాలి. నేను గొడ్డులా పనిచేశాను. నేను దొంగతనం చేసి వేరే వాళ్ల కడుపు కొట్టలేదు. మధ్యలో అమ్మ నలిగి పోతుంది. అమ్మ హాస్పిటల్‌ వెళ్లింది. ఆ తర్వాత అన్న ఇంటికి వెళ్లిపోయారు. నేను చేయని దానికి చేశాను. నా భార్య వచ్చినప్పటి నుంచి చెడ్డవాడిని అయ్యాను అంటున్నారు. వాళ్ల నాన్న, అమ్మ ఉంటే చూసి ఏమి అనకుండా ఉండేవారా? నేనే కదా.. ఇప్పుడు తనకు అమ్మ, నాన్న అని వాపోయారు. తను కష్టపడుతుంది, ఈరోజు మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. ఇన్నాళ్లు సైలెంట్‌ ఉన్నాను, మానాన్న మీద గన్ను పెట్టి కాల్చాలని చూసిన వినయ్‌, మా అన్న విష్ణుకు సమాధానం సాయంత్రం చెబుతా అన్నారు..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x