Richa Chadha controversy : మా ప్రెసిడెంట్‌కు కోపం తెప్పించిన బాలీవుడ్ నటి.. ఏం ఆడది ఇది?.. మంచు విష్ణు ట్వీట్ వైరల్

Richa Chadha controversy బాలీవుడ్ నటి రీచా చద్దా మీద మంచు విష్ణుకి కోపం తెప్పించింది. మన దేశ ఆర్మీ అధికారి వేసిన ట్వీట్ మీద రీచా చద్దా సెటైర్ వేసింది. మన దేశాన్ని తక్కువ చేసినట్టుగా మాట్లాడింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2022, 10:49 AM IST
  • సోషల్ మీడియాలో రీచా చద్దా కాంట్రవర్సీ
  • ఆర్మీని కించపరిచిన బాలీవుడ్ నటి
  • మండి పడ్డ మా ప్రెసిడెంట్ మంచు విష్ణు
Richa Chadha controversy : మా ప్రెసిడెంట్‌కు కోపం తెప్పించిన బాలీవుడ్ నటి.. ఏం ఆడది ఇది?.. మంచు విష్ణు ట్వీట్ వైరల్

Richa Chadha controversy బాలీవుడ్ హీరోయిన్లు, నటీమణులు ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంటారు. ఎక్కువగా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జ్యాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు ఇప్పుడు రీచా చద్దా చేసిన ట్వీట్ ఇండియన్స్‌ను ఆగ్రహం తెప్పిస్తోంది. పాక్ మీద దాడి చేసేందుకు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను మళ్లీ మన స్వాధీనం చేసేందుకు రెడీగా ఉన్నామంటూ భారత ఆర్మీ అధికారి కల్నల్ వేసిన ట్వీట్ మీద రీచా చద్దా కౌంటర్ వేసింది.

అప్పుడు గాల్వాన్ మళ్లీ హాయ్ చెబుతుంది అంటూ.. చైనా మనల్ని ఆక్రమిస్తుంది అని కౌంటర్ వేసింది. దీంతో రీచా చద్దాను అందరూ ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. ఇది చిలికి చిలికి గాలి వానలా మారడంతో.. నేలకు దిగొచ్చింది రీచా చద్దా. అందరికీ క్షమాపణలు చెబుతూ.. అది అనుకోకుండా వేసిన ట్వీట్ అని, అందరినీ బాధించిందని, క్షమించండని కోరుతూ తన ఫ్యామిలీ, ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పింది.

 

అయితే రీచా చద్దా వేసిన ట్వీట్ మీద మా ప్రెసిడెంట్ మంచు విష్ణు మండిపడ్డాడు. ఈ ఆడదానికి ఏమైంది?.. అలా ఎలా అనగలుగుతోంది.. మన ఆర్మీని మనం గౌరవించుకోవాలి.. మన దేశం కోసం వారు ప్రాణాలను త్యాగం చేస్తున్నారు.. ఇలాంటి వారిని చూసినప్పుడు ఎంతో బాధగా అనిపిస్తుందంటూ మంచు విష్ణు ట్వీట్ వేశాడు.

ఇక రీచా చద్దాకు వ్యతిరేకంగా బాలీవుడ్ కూడా గొంతు ఎత్తంది. అక్షయ్ కుమార్ కూడా రీచా చద్దాను తప్పుబట్టాడు. ఇలా ఇండస్ట్రీ జనాలు, బయట జనాలు దుమ్మెత్తిపోయడంతో రీచా చద్దా మొత్తానికి తన తప్పు తెలుసుకుంది. అందరికీ క్షమాపణలు చెప్పింది. అయితే తన కుటుంబ సభ్యుల్లో ఎంతో మంది ఆర్మీలో ప్రాణాలు కోల్పోయారని, ఆ బాధ తనకు కూడా తెలుసు.. ఆర్మీని కించపర్చాలనే ఉద్దేశ్యంతో అలా చేయలేదంటూ లెంపలేసుకున్నట్టుగా ట్వీట్ వేసింది.

Also Read : Alia Bhatt Daughter Name : అలియా భట్ కూతురు పేరు ఏంటంటే?.. ఏ ఏ భాషలో ఏ ఏ అర్థమంటే?

Also Read : Love Today Telugu Movie Review : లవ్ టుడే రివ్యూ.. ఫన్ అండ్ ఎమోషనల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News