Kannappa: కన్నప్ప మూవీ మరో సంచలనం.. మన దేశంలోనే ఆ రికార్డు అందుకోబోతున్న ఫస్ట్ సినిమా..

Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్‌ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్, మోహన్‌లాల్ వంటి నటులు యాడ్ కావడంతో ఈ సినిమా అంచనాలు పీక్స్‌కు వెళ్లాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ విషయమై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : May 13, 2024, 03:58 PM IST
Kannappa: కన్నప్ప మూవీ మరో సంచలనం.. మన దేశంలోనే  ఆ రికార్డు అందుకోబోతున్న ఫస్ట్ సినిమా..

Kannappa: మంచు విష్ణు హిట్ ముఖం చూసి చాలా యేళ్లే అవుతోంది. అపుడెపుడే దేనికైనా రెడీ, ఆడోరకం ఈడోరకం సినిమాల తర్వాత సరైన హిట్ అన్నదే లేకుండా పోయింది. అప్పట్లో జిన్నా మూవీతో పలకరించాడు. ఈ సినిమాకు టాక్ బాగున్నా.. ఈ సినిమాకు కనీస ఓపెనింగ్స్ రాలేదు. ఈ సారి హిట్టు కొట్టాలన్న కసితో తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' మూవీతో పలకరించబోతున్నాడు. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్, మోహన్ లాల్ పాత్రలకు సంబంధించిన షూటింగ్ పూర్తైయింది. తాజాగా ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ చేస్తున్నాడు. ఈ వీకెండ్ వరకు రెబల్ స్టార్ పార్ట్‌కు సంబంధించిన షూట్ కంప్లీట్ కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 20న తన తమ్ముడు మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఈ సినిమా టీజర్‌ను 6 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు చెప్పాడు.

ఒక తెలుగు ప్యాన్ ఇండియా కాదు... కాదు ప్యాన్ వరల్డ్ మూవీ టీజర్ ఈ రేంజ్‌లో విడుదల చేయడం అనేది మాములు విషయం కాదంటున్నారు. మరి ఈ టీజర్‌ అంచనాలు మించి ఉంటే కానీ ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావు. పైగా ప్యాన్ ఇండియా స్టార్స్ ప్యాడింగ్ కావడం వల్ల  ఈ సినిమాకు ఏ మేరకు కలిసిచ్చి.. మంచు విష్ణుకు ఏ మేరకు హిట్ అందిస్తుందా లేదా అనేది చూడాలి.

Also read: Voter Slip: ఓటరు స్లిప్ అందకున్నా నో ప్రాబ్లెమ్, ఇలా సింపుల్‌గా డౌన్‌లోడ్ చేయవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News