Marvel Movies: భాగ్యనగరంలో మొదలైన మార్వెల్ ఫ్యాన్స్ సంబ‌రాలు.. మొద‌లైన‌ డెడ్ పుల్ & వాల్వ‌రిన్ బుకింగ్స్..

Marvel Movies: ప్రపంచ వ్యాప్తంగా మార్వెల్ సిరీస్ మూవీస్ కు మంచి డిమాండ్ ఉంది. మన భారతీయ ప్రేక్షకులు సైతం ఈ సినిమాలను ఆదరించిన సందర్భాలున్నాయి. ఇపుడీ సిరీస్ లో డెడ్ పుల్ అండ్ వాల్వరిన్ మూవీకి సంబంధించిన బుకింగ్స్ ఊపందుకున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 16, 2024, 09:18 AM IST
Marvel Movies: భాగ్యనగరంలో మొదలైన మార్వెల్ ఫ్యాన్స్ సంబ‌రాలు.. మొద‌లైన‌ డెడ్ పుల్ & వాల్వ‌రిన్ బుకింగ్స్..

Marvel Movies: మార్వెల్ సిరీస్  సినిమాలు విడుదల అవుతుందంటే చాలా..  ప్రపంచ‌ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో ఓ రకమైన క్రేజ్ ఏర్పడటం ఎప్పటి నుంచో ఉంది.  ఈ సినిమాల్లో క‌నిపించే సూప‌ర్ హీరోల ఫ్యాన్స్  సంబ‌రాల్లో మునిగితేలుతుంటారు. మార్వెల్ యూనీవ‌ర్స్ నుంచి డెడ్ పుల్ సిరీస్ లో భాగంగా జూలై 26న డెడ్ పుల్ & వాల్వరిన్ మూవీ విడుదలకు రెడీగా ఉంది.  ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైల‌ర్ యూట్యూబ్ లో మిలియ‌న్స్ కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతుంది.

అంతేకాదు ఈ ట్రైలర్ తో వరల్డ్ వైడ్ గా ఉన్న మార్వెల్ ఫ్యాన్స్ లో ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయమై ఉత్కంఠ రేపుతోంది. ఈసారి డెడ్ పుల్ తో పాటు వాల్వ‌రిన్ కూడా వెండితెర పై అద్భుత విన్యాసాలు చేయ‌బోతున్నాడు. ఒకసారి ఇద్దరు సూప‌ర్ హీరోలు ఫ్యాన్స్ ముందుకు రాబోతున్నారు.  ఈ నేప‌థ్యంలో డెడ్ పుల్ అండ్ వాల్వ‌రిన్ మోస్ట్ ఫెవ‌రేట్ మార్వెల్ మూవీగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతుందనే విషయమై అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు.

తాజాగా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో హైద‌దాబాద్ లో మార్వెల్ సినిమాల ఫ్యాన్స్  అపుడే సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారు.  రీసెంట్ గా  డెడ్ పుల్ & వాల్వ‌రిన్ టికెట్లు బుకింగ్ మొద‌లైంది. అంతేకాదు ఫ్యాన్స్ కూడా ఈ సినిమా టికెట్స్ ను బుక్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఈ సెల‌బ్రేష‌న్ వీడియోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.  డెడ్ పుల్ & వాల్వ‌రిన్ లో లీడ్ రోల్స్ లో  ర‌య‌న్ రెనాల్డ్స్, హుయ్ జాక్ మెన్ న‌టించారు. జూలై 26న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో డెడ్ పుల్ & వాల్వ‌రిన్ రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమా కూడా గత మార్వెల్ చిత్రాల మాదిరి సంచలనాలకు వేదికగా మారుతుందా లేదా అనేది చూడాలి.

Also Read: Hyderabad T Square: న్యూయార్క్‌ను తలదన్నేలా హైదరాబాద్‌లో భారీ నిర్మాణం.. ప్రపంచస్థాయిలో టీ స్క్వేర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News