RRR Teaser: ఆర్ఆర్ఆర్ సినిమా టీజర్‌కు వాయిస్ ఓవర్ ఎవరో తెలుసా..

RRR Teaser: బాహుబలితో ప్రపంచస్థాయిలో ఖ్యాతి నార్జించిన టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి. ఇప్పుడితడి దృష్టి అంతా ఆర్ఆర్ఆర్ సినిమాపైనే ఉంది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా అఫీషియల్ టీజర్ మరింత ఆసక్తి రేపబోతోంది..దీనికి కారణం..

Last Updated : Jan 6, 2021, 01:18 PM IST
RRR Teaser: ఆర్ఆర్ఆర్ సినిమా టీజర్‌కు వాయిస్ ఓవర్ ఎవరో తెలుసా..

RRR Teaser: బాహుబలితో ప్రపంచస్థాయిలో ఖ్యాతి నార్జించిన టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి. ఇప్పుడితడి దృష్టి అంతా ఆర్ఆర్ఆర్ సినిమాపైనే ఉంది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా అఫీషియల్ టీజర్ మరింత ఆసక్తి రేపబోతోంది..దీనికి కారణం..

మెగా బ్లాక్‌బస్టర్ సినిమా బాహుబలి ( Bahubali ) తర్వాత రాజమౌళి ( Rajamouli ) చేస్తున్న క్రేజీ మూవీ ఆర్ఆర్ఆర్ ( RRR Movie ). ఈ సినిమాను  ప్రముఖ నిర్మాత డివివి దానయ్య 4 వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటిస్తున్నారనేది అందరికీ తెలిసిందే. ఇద్దరు రియల్ లైఫ్ లీడర్స్ పాత్రల్లో చరణ్, తారక్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ పాత్రలకు సంబంధించిన విడుదలైన టీజర్‌తో అంచనాలు పెరిగాయి. ఇప్పుడిక త్వరలో విడుదల కానున్న సినిమా అఫీషియల్ టీజర్ మరింత ఆసక్తి రేపబోతోంది దీనికి కారణం ఆ టీజర్‌కు వాయిస్ ఓవర్. 

ఆర్ఆర్ఆర్ సినిమా టీజర్ ( RRR Movie Teaser ) ‌ను రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. టీజర్ ట్రిమ్మింగ్ పని జరుగుతోంది. అయితే ఈ టీజర్‌కు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) వాయిస్ ఓవర్ ఉంటుందనేది పరిశ్రమ వర్గాల్లో సమాచారం. తెలుగు టీజర్‌కు చిరంజీవి, హిందీ టీజర్‌కు అమీర్ ఖాన్ వాయిస్ ఉండబోతోంది. కోలీవుడ్ సంగతి ఇంకా తెలియదు. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా టీజర్‌ను రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. టీజర్‌తోనే రికార్డులు సాధించే పనిలో పడ్డాడు జక్కన్న.

Also read: Vennelakanti passes away: వెన్నెలకంటి ఇక లేరు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News