Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ కోసం సూపర్ స్కెచ్.. బాలయ్య కూతురు కూడా సినిమాల్లోకి!

Mokshagna Debut: నందమూరి మోక్షజ్ఞ తన తొలి సినిమా కోసం సిద్ధమవుతున్నారు, దీనికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం..వహించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది. ఈ సినిమాతో మోక్షజ్ఞ.. ప్రేక్షకుల ముందుకు రావడాన్ని.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Written by - Vishnupriya | Last Updated : Jul 12, 2024, 04:46 PM IST
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ కోసం సూపర్ స్కెచ్.. బాలయ్య కూతురు కూడా సినిమాల్లోకి!

Mokshagna Debut: నందమూరి మోక్షజ్ఞ హీరోగా అడుగుపెట్టే సమయం.. ఆసన్నమైంది. సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌ హనుమాన్ వంటి సినిమాకి.. దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ, ఈ ప్రాజెక్ట్‌కి డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కి.. ఇప్పుడు ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటి అంటే.. బాలకృష్ణ కుమార్తె, మోక్షజ్ఞ సోదరి.. తేజస్విని ఈ సినిమాని నిర్మించనున్నారు.

Add Zee News as a Preferred Source

విశాఖపట్నం ఎంపీ భారత్ ను పెళ్లి చేసుకున్న.. తేజస్విని గత ఏడాది నుండి.. నిర్మాత అవ్వాలని ప్లాన్ లో ఉన్నారు. ఈ విషయం గురించి తన తండ్రి.. బాలయ్య తో కూడా పలుచర్చలు అయ్యాయట. బాలయ్య సినిమా విషయాలను కూడా గమనిస్తూ వచ్చారు. ఇప్పుడు నిర్మాత అవ్వడానికి.. ఫుల్ ప్లాన్ లో ఉన్నారట.

ఇక మోక్షు లాగానే తేజస్విని కూడా ఈ సినిమాతో ప్రొడ్యూసర్ గా.. డెబ్యూ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ఆషాడ మాసం మంచి టైమ్ కాదు. అందుకే ఈ నెల.. తరువాత సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇక బాలకృష్ణ ఈ సినిమా విషయంలో.. ముఖ్యంగా కథ ఎంపికలో బోలెడు జాగ్రత్తలు వహిస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ మీద కూడా ఈ భాధ్యత పడింది. పైగా ఇది మొక్షుకే కాదు.. తేజస్విని మొదటి సినిమా కాబట్టి బాలయ్య సినిమా విషయంలో ఇంకా జాగ్రత్తలు వహిస్తున్నారు.

ఎలాగో సినిమాల విషయంలో బాలకృష్ణ కి.. అన్నీ తెలుసు. అవగాహన, అనుభవం రెండు ఉన్నాయి కాబట్టి అవి వీళ్ళిద్దరికీ బాగా ఉపయోగపడతాయి. సొంత తమ్ముడు మోక్షజ్ఞ ఎంట్రీ తో నందమూరి వారసురాలు కూడా సినిమాల్లోకి రావడం ఫ్యాన్స్ కి చాలా సంతోషమైన విషయం. ఈ సినిమా ఎంత వరకు హిట్ అయ్యి ఇద్దరికీ మర్చిపోలేని సినిమాగా మారుతుందో చూడాలి.

Read more: Snakes smuggling: అక్కడ ఎలా దాచావ్ భయ్యా.. ప్యాంటులో 100 కు పైగా బతికున్న పాములు.. వీడియో వైరల్.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News