Aranya Movie: అరణ్య సినిమా ఓటీటీలో ఇవాళ్టి నుంచి అందుబాటులో

Aranya Movie: బాహుబలి నుంచి దగ్గుబాటి రాణా సినిమాల ఎంపిక పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మరో విభిన్న కధాంశంతో నటించి హ్యాట్సాఫ్ అన్పించుకుంటున్నాడు. ఆ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 15, 2021, 08:21 AM IST
  • దగ్గుబాటి రాణా నటించిన అరణ్య సినిమా ఓటీటీలో విడుదల
  • ప్రముఖ ఓటీటీ వేదికైన జీ5లో ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్
  • మార్చ్ 16న ధియేటర్లలో విడుదలై హిట్ టాక్ సాధించిన సినిమా
 Aranya Movie: అరణ్య సినిమా ఓటీటీలో ఇవాళ్టి నుంచి అందుబాటులో

Aranya Movie: బాహుబలి నుంచి దగ్గుబాటి రాణా సినిమాల ఎంపిక పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మరో విభిన్న కధాంశంతో నటించి హ్యాట్సాఫ్ అన్పించుకుంటున్నాడు. ఆ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

దర్శకుడు ప్రభు సాల్మన్ తెరకెక్కించిన అరణ్య సినిమా దగ్గుబాటి రాణా(Daggubati Rana)కెరీర్‌లో ఓ విలక్షణ చిత్రంగా నిలవనుంది. బాహుబలి తరువాత నుంచి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలతో ఎక్కువగా దృష్టి సారిస్తున్న దగ్గుబాటి రాణా మరో విభిన్న కధాంశంతో కూడిన సినిమాలో నటించి హ్యాట్సాఫ్ అన్పించుకున్నాడు. 2020 మార్చ్ 20న విడుదలైన అరణ్య సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది. హిట్‌టాక్ మూటగట్టుకుంది. ఇప్పుడా సినిమా దసరా పురస్కరించుకుని ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో ఇవాళ అరణ్య సినిమా(Aranya movie on Zee 5)విడుదలైంది.

ఈ సినిమాలో విష్ణు విశాల్ కీలకపాత్రలో నటించాడు. శ్రియ, జోయా హుస్సేన్‌లు ప్రముఖ పాత్రల్లో కన్పించనున్నారు. శాంతను సంగీతం అందించిన అరణ్య సినిమాను ఏరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మించారు. విశాఖపట్నం సమీపంలోని చిలకలకోన అడవి అది. తరతరాలుగా ఏనుగుల్ని రక్షించే కుటుంబంలో పుట్టి పెరుగుతాడు హీరో రాణా. ఏనుగుల రక్షణ కోసం పడుతున్న శ్రమకు గుర్తింపుగా ఫారెస్ట్ మేన్‌గా రాష్ట్రపతి అవార్డు సాధిస్తాడు. అదే సమయంలో కేంద్రమంత్రి రాజగోపాలం చిలకలకోన అడవిపై కన్నేస్తాడు. డీఎల్ఆర్ టౌన్‌షిప్ కట్టేందుకు రంగంలో దిగుతాడు. ఏనుగులు నీటి కోసం వెళ్లే అటవీ ప్రాంతంలో కూడా గోడ కట్టేస్తాడు. ఈ క్రమంలో రాణా ఎలా పోరాడుతుడానేదే ఈ సినిమా కథాంశం. 

Also read: Manchu Manoj meets Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ని కలిసిన మంచు మనోజ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News