టాలీవూడ్ కా ట్విట్టర్ 'బాద్షా'

Last Updated : Nov 5, 2017, 12:47 PM IST
టాలీవూడ్ కా ట్విట్టర్ 'బాద్షా'

సోషల్ మీడియా హవా ఏంటో అందరికీ తెలిసిందే. పేస్ బుక్, ట్విట్టర్.. ఇలా అనేకం ఉన్నాయి. ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా సినిమా, రాజకీయ ప్రముఖులకు ఫాలోవర్లు ఉంటారు. ఇందులో చిన్నా,పెద్ద, దుఃఖం, సంతోషం అనే తేడా లేకుండా ప్రతి విషయాన్నీ పోస్ట్ చేస్తుంటారు. పాలోవర్లు ఆ విషయాన్ని ఫాలో అయిపోతారు. 

సినీ గ్లామర్ కు ఈ సోషల్ మీడియా ఒక ప్రచార అస్త్రం. వీటినే వేదికలుగా చేసుకొని ముఖ్య తారలు కూడా పోస్ట్ లు పెడుతున్నారు. దాదాపు మన దేశంలో సెలబ్రిటీలందరికీ ట్విట్టర్ అకౌంట్ లు ఉన్నాయి. అందులో మన టాలీవూడ్ స్టార్ లు కూడా ఉన్నారు. 

ఈ మధ్య కాలంలో మన స్టార్స్ కూడా ట్విట్టర్ లో ఆక్టివ్ గా ఉన్నారు. అందులో నాగార్జున ఒకరు. ఈ మన్మధుడు తన సినిమా ప్రమోషన్స్ ని ఎక్కువగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేస్తాడు. మన టాలీవూడ్ బాబుల్లో కొందరి ఫాలోవర్లు సంఖ్య తాజాగా నాలుగు మిలియన్ల మార్క్ దాటింది. మన హీరోలకు దీటుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా 3.69M ఫాలోవర్స్ ఉన్నారు.

ట్విట్టర్ ఫాలోవర్స్ లో టాప్ 10 టాలీవూడ్ హీరోలు  

*సూపర్ స్టార్ మహేష్ బాబు - 4.63M ఫాలోవర్స్

*నాగార్జున అక్కినేని - 4.03M ఫాలోవర్స్

*రానా దగ్గుబాటి - 4.02M ఫాలోవర్స్

*సిద్దార్థ్ - 3.49M ఫాలోవర్స్

*పవన్ కళ్యాణ్ - 2.1M ఫాలోవర్స్

*నాని - 2. 05M ఫాలోవర్స్

*అల్లు అర్జున్ - 1.7M ఫాలోవర్స్

*నితిన్ - 1.59M ఫాలోవర్స్

*అక్కినేని అఖిల్- 1.5M ఫాలోవర్స్

*జూనియర్ ఎన్టీఆర్- 1.49M ఫాలోవర్స్

Trending News