ఫాలోవర్స్‌కు సంబంధించిన తాజా డేటాను ట్విట్టర్ విడదల చేసింది. ఈ సందర్భంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ మీడియా కథనం ప్రకారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ 67 శాతం నకిలీ ఫాలోవర్స్ తో అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు తేలింది. బీజేపీ చీఫ్ అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిధరూర్, భారత ప్రధాని మోడీ ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. వీరందరికీ సిసలైన ఫాలోవర్లకంటే నకిలీ ఫాలోవర్లు ఉండటం గమనార్హం..
2017 సంవత్సరానికి గానూ ప్రధాని నరేంద్ర మోదీ 'మోస్ట్ ట్వీటేడ్ అబౌట్ వరల్డ్ లీడర్' జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరువాతి స్థానంలో నిలిచారు.
ప్రధాని మోదీ కన్నా కోహ్లీనే ట్విట్టర్ లో టాప్ లో ఉన్నారు. ప్రధాని మోదీ ని అనుసరించే వారికన్నా 2017వ సంవత్సరంలో కోహ్లీని అనుసరించే ఫాలోవర్స్ సంఖ్య అధికంగా ఉందట. ఈ విషయాన్ని ఒక వెబ్సైటు గణాంకాలతో సహా వెల్లడించింది.
సోషల్ మీడియా హవా ఏంటో అందరికీ తెలిసిందే. పేస్ బుక్, ట్విట్టర్.. ఇలా అనేకం ఉన్నాయి. ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా సినిమా, రాజకీయ ప్రముఖులకు ఫాలోవర్లు ఉంటారు. ఇందులో చిన్నా,పెద్ద, దుఃఖం, సంతోషం అనే తేడా లేకుండా ప్రతి విషయాన్నీ పోస్ట్ చేస్తుంటారు. పాలోవర్లు ఆ విషయాన్ని ఫాలో అయిపోతారు.
సినీ గ్లామర్ కు ఈ సోషల్ మీడియా ఒక ప్రచార అస్త్రం. వీటినే వేదికలుగా చేసుకొని ముఖ్య తారలు కూడా పోస్ట్ లు పెడుతున్నారు. దాదాపు మన దేశంలో సెలబ్రిటీలందరికీ ట్విట్టర్ అకౌంట్ లు ఉన్నాయి. అందులో మన టాలీవూడ్ స్టార్ లు కూడా ఉన్నారు.
ట్విప్లొమసీ జరిపిన తాజా సర్వేలో ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిఉన్న నాయకుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదటిస్థానంలో, నరేంద్ర మోడీ మూడవ స్థానంలో నిలిచారు. ట్విప్లొమసీ తాజా అక్టోబర్ రిపోర్ట్ ప్రకారం, డోనాల్డ్ ట్రంప్ 39,735,749 ఫాలోవర్స్ తో మొదటి స్థానం, పొప్ ప్రాన్సిస్ 39,526,509 ఫాలోవర్స్ తో రెండవ స్థానం, నరేంద్రమోదీ 34,878,753 ఫాలోవర్స్ తో మూడవ స్థానంలో నిలిచారు. ట్విప్లొమసీ అనేది ప్రభుత్వాలు మరియు అంతర్జాతీయ సంస్థల ట్విటర్ వినియోగాన్ని ట్రాక్ చేసే ఒక బర్సన్ మార్స్టెల్లెర్ పరిశోధన ప్రాజెక్ట్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.