Pawan Kalyan birthday: పవన్ కల్యాణ్ బర్త్‌డే కానుకగా Bheemla Nayak title song లాంచింగ్

Bheemla Nayak title song launching on Pawan Kalyan birthday: పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి (Pawan Kalyan and Rana Daggubati) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మల్టీస్టారర్ భీమ్లా నాయక్ మూవీ టైటిల్ సాంగ్ విడుదల కానుంది. భీమా నాయక్ అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్, రానా దగ్గుబాటి ఫ్యాన్స్ ఈ న్యూస్‌ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 

Written by - Pavan | Last Updated : Sep 2, 2021, 02:27 AM IST
Pawan Kalyan birthday: పవన్ కల్యాణ్ బర్త్‌డే కానుకగా Bheemla Nayak title song లాంచింగ్

Bheemla Nayak title song launching on Pawan Kalyan birthday: సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు కానుకగా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ లాంచ్ చేసేందుకు ముహూర్తం రెడీ అయింది. గురువారం ఉదయం 11:16 గంటలకు పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి (Pawan Kalyan and Rana Daggubati) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మల్టీస్టారర్ భీమ్లా నాయక్ మూవీ టైటిల్ సాంగ్ విడుదల కానుంది. భీమా నాయక్ అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్, రానా దగ్గుబాటి ఫ్యాన్స్ ఈ న్యూస్‌ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీంతో భీమ్లా నాయక్ మూవీ టైటిల్ సాంగ్ టాపిక్ ఆ పాట విడుదల కంటే ముందే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also read : Tuck Jagadish Trailer: అంచనాలు పెంచిన టక్ జగదీష్ ట్రైలర్

భీమ్లా నాయక్ మూవీ టైటిల్ సాంగ్‌కి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా ఫేమస్ మ్యూజిక్ కంపోజర్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఇప్పటికే భీమ్లా నాయక్ మూవీ గ్లింప్స్ వీడియో సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఈ వీడియోకు థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదుర్స్ అనిపించేలా ఉంది. అందుకే భీమ్లా నాయక్ మూవీ టైటిల్ సాంగ్ ఇంకెలా ఉంటుందో అనే ఆత్రుత పవన్ కల్యాణ్ అభిమానుల్లో (Pawan Kalyan's fans) ఉంది. 

Also read : Pizza 2 Telugu Trailer: సస్పెన్స్ థ్రిలర్ పిజ్జా 2 ట్రైలర్ విడుదల

ఇప్పటికే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, యమ క్రేజ్ ఉన్న పవన్ కల్యాణ్‌ని మరో స్థాయికి తీసుకెళ్లేలా భీమ్లా నాయక్ మూవీ టైటిల్ సాంగ్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. మళయాళంలో అయ్యప్పనుం కొషియం (Ayyappanum Koshiyum Telugu remake) పేరిట వచ్చిన సినిమాకు తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌‌పై నాగ వంశి నిర్మిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తుండటం మరో విశేషం.

Also read : Jabardasth Avinash Engagement: ఎంగేజ్మెంట్‌తో సడెన్ షాకిచ్చిన ముక్కు అవినాష్.. అమ్మాయి ఎవరో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News