Mr Bachchan Closing Box Collections: నిర్మాతలను కోలుకోలేని దెబ్బ తీసిన ‘మిస్టర్ బచ్చన్’ మూవీ.. టోటల్ లాస్ ఎంతంటే..!

Mr Bachchan closing Box Collections: మాస్ మహారాజ్ రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన మూడో చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్స  కానుకగా విడుదలైన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఎపుడో థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా నిర్మాతలకు మొత్తంగా ఎంతో లాస్ తీసుకొచ్చిందంటే.. 

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 8, 2024, 07:00 AM IST
Mr Bachchan Closing Box Collections: నిర్మాతలను కోలుకోలేని దెబ్బ తీసిన  ‘మిస్టర్ బచ్చన్’ మూవీ.. టోటల్ లాస్ ఎంతంటే..!

Mr Bachchan closing Box Collections: తెలుగులో కొన్ని కాంబినేషన్స్ లో సినిమా అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. అలాంటి కాంబినేషన్ లో రవితేజ, హరీష్ శంకర్ లది. వీళ్లిద్దరి కలయికలో గతంలో ‘షాక్’, ‘మిరపకాయ్’ వంటి సినిమాలొచ్చాయి. షాక్ సినిమా ఫ్లాప్ అయినా.. మంచి సినిమాగా పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘మిరపకాయ్’ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత వీళ్ల కలయికలో వచ్చిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హిందీలో హిట్టైన ‘రెయిడ్’ చిత్రాన్నిఅలాగే తెరకెక్కించి ఉంటే ఈ సినిమా హిట్టైయ్యదేమో. కానీ హరీష్ శంకర్ ఈ సినిమాను  పూర్తిగా మార్చి సరికొత్త స్క్రిప్ట్ తో తెరకెక్కించి పెద్ద తప్పు చేసాడనే చెప్పాలి.  అంతేకాదు తెలుగు ప్రేక్షకులకు దూరంగా హిందీ పాటల అంత్యాక్షరి చూసినట్టు ఉందనే కామెంట్స్ వినపబడ్డయి.

ఇంటర్వెల్ వరకు ఈ సినిమా అసలు పాయింట్ చెప్పుకుండా.. ఏదో పాటలతో టైమ్ పాస్ చేసి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు.  బాలీవుడ్ లో  బ్లాక్ బస్టర్ గా నిలిచిన అజయ్ దేవ్ గణ్ హీరోగా తెరకెక్కిన ‘రెయిడ్’ చిత్రానికి రీమేక్ గా ‘మిస్టర్ బచ్చన్’ మూవీని  తెరకెక్కించాడు హరీష్ శంకర్. ఈ చిత్రం  1980లో ప్రముఖ ఇన్ కంటాక్స్ ఆఫీసర్ సర్ధార్ ఇందర్ సింగ్ లైఫ్ నేపథ్యంలో రాజ్ కుమార్ గుప్తా తెరకెక్కించారు. అయితే ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా దక్షిణాది ప్రేక్షకులు పెద్దగా  ఎక్కలేదు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.

‘ధమాకా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సోలో  హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు రవితేజ. తాజాగా ‘మిస్టర్ బచ్చన్’ మూవీతో  అది అందని ద్రాక్షగానే మిగిలిచింది. మొత్తంగా హరీష్ శంకర్ పైత్యాన్ని ఈ సినిమాలో చూపెట్టాడు. ‘మిస్టర్ బచ్చన్’ గా రవితేజను ఆ క్యారెక్టర్ లో  చూడమని చెప్పేసారు ఆడియన్స్. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికొస్తే..

తెలంగాణ (నైజాం).. రూ. 3.08 కోట్లు..
సీడెడ్ (రాయలసీమ) -- రూ. 1.15 కోట్లు
మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ .. రూ. 2.78 కోట్లు
ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 7.08 కోట్లు షేర్ (రూ. 11.40 కోట్ల గ్రాస్)
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ .. రూ. 46 లక్షలు
ఓవర్సీస్.. రూ. 59 లక్షలు..
మొత్తంగా ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.06 కోట్ల షేర్ (రూ. 13.80 కోట్ల గ్రాస్) రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా మొదటి వారంలో రూ. 7.92 కోట్ల షేర్ (రూ. 13.20 కోట్ల గ్రాస్) కలెక్షన్స్ రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా మొదటి వారానికే చేతులెత్తేసింది.   

ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 31 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  రూ. 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగింది.  ఈ సినిమా  ప్రపంచ వ్యాప్తంగా  వరకు రూ. 8.06 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు రూ. 23.94 కోట్ల షేర్ దూరంలో ఆగిపోయింది. మొత్తంగా నిర్మాతలకు ఈ సినిమా రూ. 24 కోట్ల వరకు భారీ నష్టాలను తీసుకొచ్చింది. అంతేకాదు నిర్మాతలకు భారీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. టోటల్ గా రవితేజకు హరీష్ శంకర్ పెద్ద రాడ్ దింపాడనే చెప్పాలి. టోటల్ గా  హరీష్ శంకర్ చేసిన ఈ ప్రయోగాన్నిఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదనే చెప్పాలి. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా  నటించింది.

ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

Trending News