నాయినా..! ఈ ఫీట్లు సినిమాలో చేస్కో

"ఇలాంటి ఫీట్లు సినిమాలో చేస్కో.. ముంబై రోడ్ల మీద కాదు" అంటూ ఆగ్రహించిన ముంబై పోలీసులు. క్షమాపణ చెప్పిన వరుణ్ ధావన్.

Last Updated : Nov 24, 2017, 01:16 PM IST
నాయినా..! ఈ ఫీట్లు సినిమాలో చేస్కో

ఆయన ఒక సెలెబ్రిటీ.. అభిమాని కోరిక కాదనలేక అత్యుత్సాహం చూపాడు. పోలీసులు మండిపడగా.. ఆ హీరో క్షమాపణ చెప్పాడు. ఇంతకీ ఎవరా హీరో చెప్పాలేదు కదూ..! బాలీవూడ్ యువ హీరో వరుణ్ ధావన్.

వివరాల్లోకి వెళితే..  వరుణ్ ఒక సినిమా షూట్ పనినిమిత్తం ముంబై రోడ్ లో ప్రయాణిస్తూ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాడు. అతని  పక్కనే ఆటోలో ఒక అమ్మాయి ఉంది. ఆమె వరుణ్ అభిమాని అంట. ఇక అభిమాని ఊరుకుంటుందా.. వెంటనే సెల్ఫీ సార్ అందట. ఫ్యాన్ కోరికను కాదనలేక తల బయటపెట్టి మరీ ఆ అమ్మాయితో సెల్ఫీ దిగాడు వరుణ్. ఆ తరువాత ఆ ఫోటో ఒక ప్రముఖ న్యూస్ పేపర్లో ప్రచురితమైంది. ముంబై పోలీసులు హీరో ఇంటికి చలానా పంపారు.

అంతేకాదు..  "నాయినా..! ఇలాంటి ఫీట్లు సినిమాల్లో చేస్తే ఫర్లేదు. కానీ.. ముంబై రోడ్లమీద ఇలా చేయడం భావ్యం కాదు. నువ్వొక సెలెబ్రిటీవి. ఇలా చేయడం తగునా. దీనివల్ల నీ లైఫే కాదు.. మరికొందరి ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టేసే ఆస్కారం ఉంది. ఇందుకు శిక్షగా మీకు ఈ- ఛలానా పంపిస్తున్నాం. మరోసారి ఇలాంటివి చేస్తే  కఠిన శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది" అని  ట్విటర్ లో కూడా పోస్ట్ పెట్టారు. దానికి స్పందించిన వరుణ్ క్షమాపణలు చెప్పాడు. ఇకమీదట ఇలాంటివి చేయనని... ముంబై పౌరుడిగా భద్రత నియమాలను తూచ తప్పకుండా పాటిస్తానని రీ-ట్వీట్ చేసాడు. 

 

 

Trending News