Naga Chaitanya: ఆమెకు వినే ఓపిక లేదు.. అందుకే ఆమె జీవితంలో ఎవరు ఉండరు: నాగచైతన్య

Viral video: నాగచైతన్య ఇంస్టాగ్రామ్ లో చేసిన ఒక వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో భాగంగా తాను ఒక అమ్మాయిని తనకు ఓపిక లేదని అందుకే తన జీవితంలో ఎవ్వరూ ఉండడం లేదని చెప్పిన మాటలు.. అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2023, 09:30 PM IST
Naga Chaitanya: ఆమెకు వినే ఓపిక లేదు.. అందుకే ఆమె జీవితంలో ఎవరు ఉండరు: నాగచైతన్య

 Dootha: ప్రస్తుతం నాగచైతన్య తనకు మనం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. నాగచైతన్య చేసిన ఈ మొదటి వెబ్ సిరీస్ డిసెంబర్ 1 అమెజాన్ ప్రైమ్ లో విడుదలకు సిద్ధంగా ఉంది.

మనం సినిమా నాగచైతన్య కి చాలా స్పెషల్. ఎందుకంటే ఆ సినిమా తన తాత నాగేశ్వరరావు చివరి సినిమానే కాదు.. అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన చిత్రం. ఈ సినిమాలో నాగచైతన్య మాజీ భార్య సమంత హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఆ అభిమానంతోనే ప్రస్తుతం చైతు తన ఓటీటీ ఎంట్రీ కూడా ఈ దర్శకుడు చేతిలో పెట్టారు.

ఇక ఈ మధ్యనే విడుదలైన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ కూడా అందరిని విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ సిరీస్ కి ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తున్నారు అక్కినేని హీరో.

ఈ వెబ్ సిరీస్ అన్ని భాషల్లో విడుదలవుతున్న నేపథ్యంలో ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం ఇంస్టాగ్రామ్ లో ఫేమస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారికతో ఒక వీడియో చేశారు చైతు. కాగా నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంస్టాగ్రామ్ లో విపరీతమైన ఫాలోవర్స్ ఉన్న ఈమె తో మన స్టార్ హీరోలు సైతం తమ సినిమాల ప్రమోషన్స్ కోసం రీల్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలానే తన సినిమా ప్రమోషన్ కోసం చైతు కూడా నిహారికతో ఒక వీడియో చేశాడు

ఈ వీడియోలో చైతు తన వెబ్ సిరీస్ గురించి చెబుతూ ఉంటే నిహారిక ఆపకుండా ఏదో ఒక తలతిక్క ప్రశ్న అడుగుతూ ఉంటుంది.. దాంతో చిరాకు వచ్చి చైతు.. నీకు వినే ఓపిక లేదు అందుకే నీ లైఫ్ లో ఎవరూ లేరు అంటారు.. ఇక దాంతో నిహారిక బుంగమూతి పెట్టడంతో మళ్ళీ చైతు సారీ చెప్పి తన వెబ్ సిరీస్ గురించి చెబుతూ పోతారు. ఇక ఆ తర్వాత కూడా నిహారిక పిచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉండటంతో కోపంతో అక్కడ నుంచి వెళ్లిపోతారు చైతన్య. ఫైనల్ గా నిహారిక దూత 2 తను కూడా ఉంటుందని అయితే ప్రస్తుతానికి దూత డిసెంబర్ 1 అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది అని చెబుతుంది.

ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

Trending News