Ashwathama trailer : ఆసక్తిరేపుతున్న అశ్వథ్థామ ట్రైలర్

అశ్వథ్థామ మూవీ ట్రైలర్ ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఎక్కువగా ప్రేమకథా చిత్రాలతోనే పేరు తెచ్చుకున్న నటుడు నాగశౌర్య తొలిసారిగా చేస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. ముందుగా ప్రకటించినట్టుగానే ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ చేతుల మీదుగా అశ్వద్ధామ మూవీ ట్రైలర్ విడుదలైంది.

Updated: Jan 24, 2020, 06:45 PM IST
Ashwathama trailer : ఆసక్తిరేపుతున్న అశ్వథ్థామ ట్రైలర్
Youtube@Ira Creations

అశ్వథ్థామ మూవీ ట్రైలర్ ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఎక్కువగా ప్రేమకథా చిత్రాలతోనే పేరు తెచ్చుకున్న నటుడు నాగశౌర్య తొలిసారిగా చేస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. ముందుగా ప్రకటించినట్టుగానే ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ చేతుల మీదుగా అశ్వథ్థామ మూవీ ట్రైలర్ విడుదలైంది. లవ్ స్టోరీలతో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న నాగశౌర్య.. అశ్వథ్థామ మూవీతో మాస్ ఆడియెన్స్‌ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడని అశ్వథ్థామ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. రమణతేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాగశౌర్య యాక్షన్ సీక్వెల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్‌లతో అంచనాలు పెంచిన అశ్వథ్థామ మూవీ.. తాజాగా ట్రైలర్‌తోనూ ఆ అంచనాలను అలాగే పెరిగేలా చేసింది.

ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగ్‌శౌర్య సరసన మెహ్రీన్ ఫిర్జాద జంటగా నటించింది. ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సైతం సినిమాకు ఓ ప్లస్ పాయింట్ కానుందనిపిస్తోంది. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లతో ఏర్పడిన అంచనాలకు తగినట్టుగా అశ్వద్ధామ మూవీ ఉందా లేదా తెలియాలంటే.. జనవరి 31న సినిమా థియేటర్లలోకొచ్చే వరకు వేచిచూడాల్సిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..