Dasara Poster : భూమి, చంద్రుడు, సూర్యుడు కలిసి వస్తున్నారట.. నాని పోస్ట్ వైరల్

Dasara Sankranti 2023 Special Poster సంక్రాంతి సందర్భంగా నాని, కీర్తి సురేష్‌ల దసరా సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో నాని, కీర్తి సురేష్‌ల రా లుక్‌ నెట్టింట్లో వైరల్  అయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2023, 08:59 PM IST
  • సంక్రాంతి స్పెషల్‌గా దసరా పోస్టర్
  • ఆకట్టుకుంటోన్న నాని, కీర్తి సురేష్‌
  • రీసెంట్‌గానే దసరా షూటింగ్ పూర్తి
Dasara Poster : భూమి, చంద్రుడు, సూర్యుడు కలిసి వస్తున్నారట.. నాని పోస్ట్ వైరల్

 Nani Dasara New Poster నాని ఎప్పుడూ కూడా ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తుంటాడని అందరికీ తెలిసిందే. సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా ప్రయోగాలు మాత్రం ఆపకుండానే చేస్తుంటాడు. నాని ఇప్పుడు అచ్చమైన తెలంగాణ యాసలో అదరగొట్టేందుకు వస్తున్నాడు. సింగరేణి బ్యాక్ డ్రాప్‌లో నాని సినిమా చేస్తున్నాడు. నాని, కీర్తి సురేష్‌లు కలిసి దసరా అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సింగరేణి ఏరియా నేపథ్యంలో పూర్తి తెలంగాణ యాసలో చేస్తోన్న ఈ సినిమాలో నాని రగ్డ్ లుక్‌లో కనిపించబోతోన్నాడు.

నాని ఇప్పుడు కమర్షియల్ సినిమాలు చేస్తూనే ప్రయోగాలకు కూడా ఓకే చెబుతున్నాడు. శ్యామ్ సింఘ రాయ్, అంటే సుందరానికీ వంటి సినిమాలు చేస్తూనే మీట్ క్యూట్, హిట్ 2 వంటి సినిమాలు నిర్మించాడు. అలా గత ఏడాది హీరోగా, నిర్మాతగా నానికి మంచి హిట్లు పడ్డాయి. అయితే అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాకపోవడం, అనుకున్న రేంజ్‌లో కలెక్షన్లు రాకపోవడంతో నాని అభిమానులు కాస్త నిరాశచెందారు.

 

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nani (@nameisnani)

హిట్ 2 సినిమా మాత్రం నానిని నిర్మాతగా నిలబెట్టేసింది. మీట్ క్యూట్ అనే వెబ్ సిరీస్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ నాని ఇప్పుడు దసరా సినిమాతో రాబోతోన్నాడు. ఈ సినిమాతో మరోసారి నాని తన నట విశ్వరూపాన్ని చూపించబోతోన్నాడు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌, అందులోని డైలాగ్స్ అన్నీ కూడా అదిరిపోయాయి.

ఇక ఇందులో నేను లోకల్ తరువాత మళ్లీ కీర్తి సురేష్, నాని జంటగా కనిపించబోతోన్నారు. కానీ నేను లోకల్ సినిమాతో ఎంతో మోడ్రన్‌గా కనిపిస్తుంటే.. ఇందులో మాత్రం ఇద్దరూ నేచురల్‌గా, రగ్డ్ లుక్‌లో కనిపించబోతోన్నారు. సంక్రాంతి స్పెషల్‌గా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సూర్యుడు, భూమి, చంద్రుడు కలిసి వస్తున్నారంటూ నాని చెప్పుకొచ్చాడు. సూరి, వెన్నెల, ధరణి కలిసి వస్తున్నారంటూ కీర్తి సురేష్‌ చెప్పుకొచ్చింది. ఈ సినిమా మార్చి 30న థియేటర్లోకి రాబోతోన్న సంగతి తెలిసిందే.

Also Read:  Upasana Motherhood : ఈ సంక్రాంతికి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నా.. ఉపాసన పోస్ట్ వైరల్

Also Read: Nandamuri Balakrishna Controversy : ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే.. క్షమాపణలు కోరిన బాలయ్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x